సాధారణంగా కడుపు తేలికగా ఉంటేనే ఆరోగ్యం అనుకుంటాం. కానీ, కొన్నిసార్లు మనకు ఇబ్బందిగా లేదా వింతగా అనిపించే శబ్దాలు, అలవాట్లు కూడా ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు సంకేతాలని డాక్టర్ సల్హాబ్ వివరిస్తున్నారు.
- కడుపులో గురగుర శబ్దాలు (Stomach Growling)
చాలామంది కడుపులో శబ్దం వస్తే ఆకలి వేస్తుందని లేదా ఏదో సమస్య అని అనుకుంటారు. కానీ ఇది మీ జీర్ణక్రియ తనను తాను శుభ్రం చేసుకునే ప్రక్రియ.
దీనిని ‘మైగ్రేటింగ్ మోటార్ కాంప్లెక్స్’ (Migrating Motor Complex) అంటారు.
భోజనానికి మధ్య సమయంలో ప్రేగుల్లో మిగిలిపోయిన ఆహారం, బ్యాక్టీరియా మరియు గాలిని కిందకు నెట్టేటప్పుడు ఈ శబ్దాలు వస్తాయి. ఇది మీ కడుపును శుభ్రం చేసే ‘వ్యాక్యూమ్ క్లీనర్’ లాంటిది.
- తరచుగా గ్యాస్ విడుదల చేయడం (Farting)
రోజుకు 10 నుండి 20 సార్లు గ్యాస్ విడుదల చేయడం అత్యంత సాధారణం మరియు ఆరోగ్యకరం.
మీ ప్రేగుల్లోని మంచి బ్యాక్టీరియా మీరు తిన్న పీచు పదార్థాన్ని (Fibre) పులియబెట్టి, యాంటీ ఆక్సిడెంట్లను గ్రహిస్తున్నప్పుడు గ్యాస్ ఉప ఉత్పత్తిగా (By-product) వస్తుంది.
ఇది మీ గట్ మైక్రోబయోమ్ (Gut microbiome) చురుగ్గా పని చేస్తోందని చెప్పడానికి నిదర్శనం.
- తిన్న వెంటనే లేదా ఉద్వేగానికి లోనైనప్పుడు విసర్జన రావడం
దీనిని ‘గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్’ (Gastrocolic Reflex) అంటారు.
మీరు ఆహారం తీసుకోగానే కడుపు సాగుతుంది, అప్పుడు మెదడు పెద్ద ప్రేగుకు సంకేతాలు పంపి లోపల ఉన్న మలాన్ని ముందుకు నెడుతుంది.
అంటే, కొత్తగా వచ్చే ఆహారం కోసం మీ శరీరం స్థలాన్ని సిద్ధం చేస్తోందని అర్థం.
- ‘ఘోస్ట్ పూప్’ (Ghost Poop)
మలవిసర్జన చేసిన తర్వాత శుభ్రం చేసుకునేటప్పుడు (Wiping) పేపర్ లేదా నీటితో పనిలేనంత క్లీన్గా ఉండటాన్ని ‘ఘోస్ట్ పూప్’ అంటారు.
మలం సరైన ఆకృతిలో ఉండి, ఎటువంటి జిగురు లేకుండా సులభంగా బయటకు వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది.
మీరు తగినంత పీచు పదార్థం తీసుకుంటున్నారని, తగినంత నీరు తాగుతున్నారని ఇది సూచిస్తుంది.
- రోజుకు ఒకటి కంటే ఎక్కువసార్లు విసర్జన చేయడం
చాలామంది రోజుకు ఒకసారి వెళ్లడమే కరెక్ట్ అనుకుంటారు. కానీ రోజుకు మూడు సార్లు వెళ్లినా అది సాధారణమే.
ఇక్కడ ‘ఎన్నిసార్లు వెళ్లాం’ అనే దానికంటే, మలం ఎంత మెత్తగా, సులభంగా వస్తోంది అనేది ముఖ్యం.
మరీ నీళ్లలా (Diarrhoea) రానంత వరకు, రోజుకు 2-3 సార్లు వెళ్లడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు.

Leave a Reply