“మీ పేరు మీద సిమ్ ఉందా? వెంటనే చెక్ చేసుకోండి.. లేదంటే 3 ఏళ్ల జైలు & రూ. 50 లక్షల జరిమానా. కేంద్ర ప్రభుత్వ హెచ్చరిక.!!”

నకిలీ సిమ్ కార్డులను ఉపయోగించే వారికి, ఐఎంఈఐ (IMEI) నంబర్లను మార్చే వారికి టెలికాం శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

కొత్త టెలికాం చట్టం ప్రకారం, ఇలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడే వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50 లక్షల వరకు జరిమానా విధిస్తామని కేంద్రం హెచ్చరించింది.

తమ పేరు మీద ఉన్న సిమ్ కార్డులను ఇతరులకు ఇవ్వడం మానుకోవాలని అధికారులు సూచించారు. ఛత్తీస్‌గఢ్‌లో అనుమతి లేకుండా నకిలీ సిమ్ కార్డులను జారీ చేసిన ఘటన వెలుగుచూసిన తర్వాతే ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.

ముఖ్యంగా, నకిలీ పత్రాల ద్వారా సిమ్ పొందడం, వాటిని ఇతరులకు అద్దెకు ఇవ్వడం లేదా సైబర్ మోసాల కోసం ‘మ్యూల్ సిమ్’ (Mule SIM)గా ఉపయోగించడం వంటి చర్యలకు పాల్పడితే, ఆ పత్రాలకు సంబంధించిన అసలు వ్యక్తినే నేరుగా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

కాబట్టి, ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వ ‘సంచార్ సాథి’ (Sanchar Saathi) పోర్టల్ లేదా వెబ్‌సైట్ ద్వారా తమ పేరు మీద ఎన్ని మొబైల్ నంబర్లు యాక్టివ్‌గా ఉన్నాయో సరిచూసుకోవాలని కోరారు.

అంతేకాకుండా, తమకు తెలియకుండా లేదా అవసరం లేని నంబర్లు ఏవైనా ఉంటే వాటిని వెంటనే బ్లాక్ చేయాలని, అలాగే మొబైల్ ఫోన్ల అసలైన గుర్తింపును ఐఎంఈఐ (IMEI) నంబర్ ద్వారా తనిఖీ చేసుకుని అప్రమత్తంగా, సురక్షితంగా ఉండాలని సూచించారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *