ఒడిశా రాష్ట్రంలో భర్తకు ఆరోగ్యం బాగోలేదని అబద్ధం చెప్పి, ఓ వివాహితను నిర్మానుష్య ప్రాంతానికి రప్పించి ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
పోలీసుల కథనం ప్రకారం.. నిందితుల్లో ఒకడు బాధిత మహిళకు ముందే పరిచయమున్న వ్యక్తి. అతడు ఆ మహిళకు ఫోన్ చేసి, ఆమె భర్తకు అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యం చేసిందని నమ్మబలికాడు.
భర్త పరిస్థితి విని కంగారుపడిన భార్య, వెంటనే రాత్రి 7 గంటల సమయంలో చండీఖోల్ ప్రాంతానికి చేరుకుంది. అయితే, అక్కడికి వచ్చిన ఆమెను ఆ దుండగుడు జనావాసాలు లేని ఒక నిర్మానుష్య పాడుబడ్డ బంగ్లాలోకి తీసుకెళ్లాడు.
కాసేపటికే మరొక యువకుడు కూడా అక్కడికి చేరుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న ఆ ఇద్దరూ కలిసి ఆ మహిళపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దారుణం అనంతరం అస్వస్థతకు గురైన బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది.
బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కళింగనగర్ పోలీసులు కేసు నమోదు చేసి, నేరాన్ని అంగీకరించిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

Leave a Reply