కేరళ రాష్ట్రంలోని కుట్టియాట్టూర్ – కన్నూర్ మార్గంలో నడిచే ‘పార్వతి’ అనే ప్రైవేట్ బస్సులో మానవత్వాన్ని చాటిచెప్పే హృద్యమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ వృద్ధ ప్రయాణికుడు బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా, ఊహించని విధంగా కాలు జారి కింద పడబోయాడు.
ఆ సమయంలో అక్కడే ఉన్న బస్సు క్లీనర్ అతుల్ కుక్కు వెంటనే అప్రమత్తమై, మెరుపు వేగంతో ఆ వృద్ధుడిని పట్టుకుని కిందపడి గాయాలపాలు కాకుండా సురక్షితంగా కాపాడాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విడుదలై తెగ వైరల్ అవుతోంది. క్లీనర్ అతుల్ కుక్కు చూపిన ఈ సమయస్ఫూర్తిని, మానవతా దృక్పథాన్ని నెటిజన్లతో పాటు పోలీసులు సైతం ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో, ప్రయాణికులు సురక్షితంగా బస్సు ఎక్కి కూర్చునేంత వరకు డ్రైవర్లు తొందరపడకుండా వేచి చూడాలని సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు.

Leave a Reply