ముఖ్యమంత్రిగా స్టాలిన్ కంటే విజయ్ వైపే మొగ్గు! మెజారిటీ మార్కు దిశగా డీఎంకే కూటమి.. కింగ్ మేకర్‌గా మారనున్న 27 స్థానాలు?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్‌కు ముందు ప్రముఖ మీడియా సంస్థ ‘వికటన్’ గ్రూపు జరిపిన మెగా సర్వే ఫలితాలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో జరిపిన ఈ సర్వేలో డీఎంకే కూటమి మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోబోతోందని తేలింది. అయితే, రాజకీయాల్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన నటుడు విజయ్ (TVK పార్టీ) అనూహ్యమైన ప్రజాదరణ పొందుతుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.


ఎవరికి ఎన్ని సీట్లు? డీఎంకే కూటమికే పైచేయి!

సర్వే అంచనాల ప్రకారం, అధికార డీఎంకే కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను దాటే దిశగా దూసుకుపోతోంది.

  • డీఎంకే కూటమి (121 సీట్లు): డీఎంకే – 97, కాంగ్రెస్ – 10, డీఎండీకే – 4, సీపీఎం – 4, వీసీకే – 3, సీపీఐ – 2, ఎండీఎంకే – 1.
  • అన్నాడీఎంకే కూటమి (83 సీట్లు): అన్నాడీఎంకే – 75, పీఎంకే – 2, ఏఎంఎంకే – 2, బీజేపీ – 2, పురట్చి భారతం – 1.
  • విజయ్ (TVK): 3 స్థానాలు (పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్, ఆర్కే నగర్).
  • టాస్ అప్ (27 సీట్లు): సుమారు 27 స్థానాల్లో గట్టి పోటీ నెలకొందని, ఫలితం ఎటువైపైనా ఉండొచ్చని సర్వే పేర్కొంది.
ముఖ్యమంత్రి రేసులో ‘విజయ్’ టాప్!

ఈ సర్వేలో అత్యంత ఆసక్తికరమైన అంశం ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం. ప్రస్తుత సీఎం స్టాలిన్ కంటే విజయ్‌కే ఎక్కువ మంది మద్దతు తెలపడం గమనార్హం.

  • విజయ్: 44% మద్దతు
  • ఎం.కె. స్టాలిన్: 28% మద్దతు
  • ఎడప్పాడి పళనిస్వామి: 25% మద్దతు
  • సీమాన్ (NTK): 3% మద్దతు
భవిష్యత్తు నాయకుడు ఎవరు?

రాబోయే కాలంలో తమిళనాడు రాజకీయాలను శాసించే నాయకుడు ఎవరన్న ప్రశ్నకు.. 47.25% మంది విజయ్ వైపు మొగ్గు చూపారు. స్టాలిన్ (24.9%), ఎడప్పాడి (15.79%), సీమాన్ (9.03%) తర్వాతి స్థానాల్లో నిలిచారు. బీజేపీ నేత అన్నామలైకి కేవలం 1.28% మద్దతు మాత్రమే లభించింది.

విజయ్ రాకతో నష్టమెవరికి?

ఒకవేళ విజయ్ రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే.. ఆ ఓట్లు ఎవరికి పడేవనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానాలు వచ్చాయి. విజయ్ మద్దతుదారుల్లో 30.71% మంది సీమాన్‌కు, 27.56% మంది అన్నాడీఎంకేకు, 20.21% మంది డీఎంకేకు ఓటు వేసేవారని సర్వే స్పష్టం చేసింది. దీన్ని బట్టి విజయ్ ఎంట్రీ ప్రధానంగా ప్రతిపక్ష ఓట్లను చీలుస్తోందని అర్థమవుతోంది.

మార్పు కోరుకుంటున్న ప్రజలు!

రాష్ట్రంలో పాలన మారాలని 62% మంది కోరుకుంటుండగా, మార్పు అవసరం లేదని 38% మంది అభిప్రాయపడ్డారు. ఓటింగ్ శాతం పరంగా చూస్తే డీఎంకే కూటమికి 36%, అన్నాడీఎంకే కూటమికి 33%, విజయ్ పార్టీకి 27% ఓట్లు వచ్చే అవకాశం ఉంది.


Posted

in

by

Tags: