బీహార్లోని కిషన్గంజ్ ప్రాంతానికి చెందిన ఒక మహిళకు 2023లో వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజులకే ఆమె భర్త ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లాడు.
భర్త విదేశాల్లో ఉన్న సమయంలో, ఆ మహిళకు స్థానిక యువకుడితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. గత మూడేళ్లుగా ఈ వ్యవహారం కొనసాగుతుండగా, ఇటీవల భర్త కువైట్ నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. తమ అక్రమ సంబంధం విషయం ఎక్కడ తెలిసిపోతుందోనన్న భయంతో, భార్య తన ప్రియుడితో కలిసి రాత్రి వేళ గాఢ నిద్రలో ఉన్న భర్తను అతి కిరాతకంగా హతమార్చింది.
హత్య అనంతరం, ఇంట్లోకి చొరబడిన దొంగలే భర్తను చంపి విలువైన వస్తువులను దోచుకెళ్లారంటూ ఆ మహిళ కట్టుకథలు అల్లి నాటకమాడింది. అయితే ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు, ఆమె మొబైల్ కాల్ డేటాను విశ్లేషించగా అక్రమ సంబంధం బండారం, హత్య వెనుక ఉన్న అసలు కుట్ర బట్టబయలయ్యాయి. దీంతో భార్యతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Leave a Reply