భారతదేశంలో ఎక్కువగా వివాహాలు, పండుగ వేడుకలతో ముడిపడిన ఒక కళగా చూసే మెహందీ.. అమెరికాలో కొందరికి భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టే లాభదాయక వృత్తిగా మారింది.
అక్కడ జరిగే పెళ్లిళ్లు, ప్రత్యేక వేడుకల్లో మెహందీ ఆర్టిస్టులకు విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.
అమెరికాలో మెహందీ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న ప్రియాంక అనే మహిళ, తాను గంటకు సుమారు 100 అమెరికన్ డాలర్లను ఫీజుగా వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు. భారత కరెన్సీ ప్రకారం ఇది గంటకు దాదాపు ₹9,000 పైమాటే. పని గంటలు, వేడుక స్వభావాన్ని బట్టి మొత్తం సంపాదన మారుతూ ఉంటుంది. ఉదాహరణకు 10 గంటల పాటు జరిగే వివాహ వేడుకకు దాదాపు లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నారు.
వివాహ వేడుకలు, పెళ్లికూతురు బ్రైడల్ మెహందీ, వ్యక్తిగత పండుగలను బట్టి డిజైన్లు వేర్వేరుగా ఉంటాయి. ముఖ్యంగా చేతులపై అందమైన, విభిన్నమైన ఆకృతులను తీర్చిదిద్దే నైపుణ్యం ఉన్న కళాకారులకు విదేశాలలో అద్భుతమైన అవకాశాలు లభిస్తున్నాయని సమాచారం.
దీంతో మెహందీ వేయడం అనేది కేవలం ఒక అలవాటు లేదా అదనపు ఆదాయ మార్గం మాత్రమే కాకుండా, సరైన నైపుణ్యం ఉంటే పూర్తి స్థాయి కెరీర్‌గా కూడా మార్చుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారతీయ సాంప్రదాయ కళ అయిన మెహందీకి విదేశాల్లో లభిస్తున్న ఈ విశేష ఆదరణ ప్రస్తుతం ఎంతోమంది దృష్టిని ఆకర్షిస్తోంది.

Leave a Reply