బీహార్లోని వైశాలి జిల్లాలో జరిగిన ఒక వింత ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భగవాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోహువా గ్రామంలో, ఒక యువకుడు తన మేనత్తతో కలిసి అభ్యంతరకర స్థితిలో ఉండగా కుటుంబ సభ్యులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఏం జరిగింది? గోలు మహతో అనే యువకుడు తన ప్రేయసి, స్వయానా మేనత్త అయిన మమతా కుమారితో రహస్యంగా కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్ళాడు. వారు ఒక గదిలో ఉండగా, గోలుకి తాత (మమతకు తండ్రి) అయిన జగ్లాల్ మహతో లోపలికి రావడంతో ఈ బాగోతం బయటపడింది. వారిని అలా చూసిన జగ్లాల్ షాక్కు గురయ్యారు. వెంటనే చుట్టుపక్కల వారిని పిలవడంతో గ్రామస్తులు అక్కడ గుమిగూడారు.
పెళ్లికి బలవంతపు నిర్ణయం: స్థానికులు మొదట వారిని చితకబాదారు. ఆ తర్వాత వారిని ప్రశ్నించగా, “నేను నా మేనత్తను ప్రేమిస్తున్నాను, ఆమెనే పెళ్లి చేసుకుంటాను” అని యువకుడు చెప్పాడు. యువతి కూడా దానికి అంగీకరించింది. దీంతో గ్రామస్తుల సమక్షంలో, యువకుడు తన మేనత్త నుదుట సింధూరం దిద్ది వివాహం చేసుకున్నాడు. ఈ దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి.
కుటుంబ సభ్యుల ఆవేదన: ఈ వ్యవహారంపై యువతి వదిన మాట్లాడుతూ, “వీరిద్దరి ప్రవర్తనపై గతంలోనే మాకు అనుమానం ఉండేది. కానీ బంధుత్వంలో అత్తా-మేనల్లుడు కావడంతో పరువు పోతుందని భయపడి బయటకు చెప్పలేదు. కానీ నేడు ఇలా పట్టుబడటంతో పరువు పోయింది” అని వాపోయారు. గోలు మహతో, మమతా కుమారికి స్వయానా మేనల్లుడు అవుతాడు. వీరిద్దరూ గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారని, రహస్యంగా ఎన్నోసార్లు కలుసుకున్నారని సమాచారం.
ప్రస్తుతం ఈ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
