మొత్తం విలువ ₹50,00,000.. 2022లోనే గడువు ముగిసిన 10,000 కిలోల ఖర్జూరాలు.. 2026 స్టిక్కర్లతో మెగా మోసం!

కాన్పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో ఆహార భద్రతా శాఖ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో సుమారు 50 లక్షల రూపాయల విలువైన 10,000 కిలోల గడువు ముగిసిన (Expired) ఖర్జూరాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఖర్జూరాలన్నీ 2022వ సంవత్సరంలోనే గడువు ముగిసినట్లు విచారణలో తేలింది. ఈ మోసగాళ్ల ముఠా, పాత ఖర్జూర ప్యాకెట్లపై 2026 వరకు గడువు ఉన్నట్లు నకిలీ స్టిక్కర్లను అతికించి, మార్కెట్లో విక్రయించడానికి సిద్ధంగా ఉంచారు.

రమదాన్ మాసం దగ్గరపడుతున్న తరుణంలో ఖర్జూరాలకు గిరాకీ పెరుగుతుందని ఆశించి, లాభం కోసం వీరు ఈ దారుణానికి ఒడిగట్టారు. స్వాధీనం చేసుకున్న ఖర్జూర నమూనాలను ప్రయోగశాలకు పంపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇటువంటి ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.


Posted

in

by

Tags: