మొదటి భార్య ఎప్పటికీ వాడుకుని పారేసే వస్తువు కాదు; ఆమెకు సంపూర్ణ హక్కులు, భద్రత, సామాజిక గౌరవం ఖచ్చితంగా దక్కాల్సిందే.
చట్టబద్ధమైన విడాకులు తీసుకోకుండా మరో మహిళతో కలిసి జీవించడం మొదటి భార్యకు చేసే తీవ్ర ద్రోహం మరియు చట్టవిరుద్ధం. ఎలాంటి స్పష్టమైన అవగాహన లేకుండా, కేవలం భావోద్వేగాల వేగంలో, అక్రమ ఆకర్షణతో మొదలయ్యే ఇలాంటి బంధాలు.. వాస్తవాలు తెలిసొచ్చేసరికి అతి తక్కువ కాలంలోనే చేదుగా మారి ముగిసిపోవడమే చేదు నిజం.
మొదటి భార్య ఫోటోలను సోషల్ మీడియాలో దురుద్దేశంతో లేదా ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా పోస్ట్ చేయడం ముమ్మాటికీ చట్టవిరుద్ధమైన, కఠినమైన శిక్షకు అర్హమైన నేరం. భారత సమాచార సాంకేతిక (ఐటీ) చట్టం మరియు క్రిమినల్ చట్టాల ప్రకారం.. మహిళ అనుమతి లేకుండా ఆమెను అవమానించేలా ఇంటర్నెట్లో ఫోటోలను ప్రచురిస్తే, ఆధారాలతో వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. బాధితురాలు దేనికీ భయపడకుండా చట్టం ద్వారా ఈ దుశ్చర్యకు తగిన బుద్ధి చెప్పి, తనకు రావాల్సిన న్యాయాన్ని, పరిహారాన్ని ధైర్యంగా సాధించుకోవచ్చు.

Leave a Reply