మోతాదు మించిన వయాగ్రా డోస్.. ఆహ్వానించిన ప్రియురాలు గదిలోకి రాకముందే యువకుడు మృతి

గురుగ్రామ్ : పీజీలో నివసిస్తున్న 29 ఏళ్ల యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నాగ్‌పూర్‌కు చెందిన ఈ యువకుడు ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన గదికి ప్రియురాలిని ఆహ్వానించిన అతను, ఆమె రాకముందే భారీ ఏర్పాట్లు చేసుకున్న క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి గదిలో వయాగ్రా, కాండీమ్స్ సహా కొన్ని వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వయాగ్రా ఓవర్ డోస్: మరణించిన దురదృష్టవంతుడిని రోహిత్ లాల్ (29)గా గుర్తించారు. ఆఫీస్‌కు సెలవు ఉండటంతో రోహిత్ తన ప్రియురాలిని గదికి ఆహ్వానించాడు. ఆమెతో గడపాలని ఆశించిన రోహిత్, లైంగిక సామర్థ్యం కోసం వయాగ్రా వంటి మాత్రలను సేవించాడు. అయితే, అది ఓవర్ డోస్ కావడంతో గుండెపోటు వచ్చి అతను మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఘటన వెలుగులోకి వచ్చిందిలా? రోహిత్ లాల్ ప్రతిరోజూ తన సహోద్యోగితో కలిసి ఆఫీస్‌కు వెళ్లేవాడు. ఎప్పటిలాగే ఆ రోజు ఉదయం సహోద్యోగి రోహిత్ గది వద్దకు వచ్చాడు. ఎంత పిలిచినా పలకకపోవడంతో ఫోన్ చేశాడు. గదిలో ఫోన్ రింగ్ అవుతున్నా లోపలి నుండి ఎలాంటి స్పందన లేదు. తలుపు లోపల నుండి లాక్ చేసి ఉండటంతో అనుమానం వచ్చిన సహోద్యోగి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బెడ్‌పై రోహిత్ శవమై పడి ఉన్నాడు. ప్రాథమిక విచారణలో, ప్రియురాలితో గడపడానికి అతను సేవించిన వయాగ్రా మోతాదు మించడమే మరణానికి కారణమని తేలింది. దీనివల్ల అతనికి తీవ్రమైన గుండెపోటు సంభవించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

యువకుడి తల్లిదండ్రులకు సమాచారం అందించామని, వారు ఫిర్యాదు చేస్తే దాని ప్రకారం దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


Posted

in

by

Tags: