తమిళనాడులోని తిరుక్కోవిలూర్ వద్ద ఒక విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. ప్రధానమంత్రి మోదీ పాల్గొనే సభకు జనాలను తీసుకురావడానికి పార్టీ నాయకత్వం ₹3 లక్షల రూపాయలను విల్లుపురం దక్షిణ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ధర్మరాజ్కు అందజేసింది. అయితే, ఈ డబ్బును పంచుకోవడంలో పార్టీ నేతల మధ్య గొడవ మొదలైంది.
ఈ క్రమంలో ఆగ్రహం చెందిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ.జి. సంపత్ మద్దతుదారులు, వీరపాండి గ్రామంలోని ధర్మరాజ్ ఇంటి ముందు నిలిపి ఉంచిన రెండు కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. ఈ దాడి గురించి ధర్మరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై పోలీసులు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ.జి. సంపత్, జిల్లా ఉపాధ్యక్షుడు తెన్నరసు, లోకనాథన్ అనే ముగ్గురు నేతలపై కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.
