జెరూసలేం: “మిత్రమా… మీ రాక చారిత్రాత్మకం!” – ఫిబ్రవరి 26న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కౌగిలించుకుని వీడ్కోలు పలికినప్పుడు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కళ్లలో ఒక వింత మెరుపు కనిపించింది.
ఆ మెరుపు అర్థం ఏమిటో అప్పుడు ఎవరికీ తెలియదు. కానీ, మోదీ ఎక్కిన ఎయిర్ ఇండియా విమానం ఇజ్రాయెల్ గగనతలాన్ని దాటి, భారత్ వైపు వెళ్లడం ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ప్రపంచాన్ని కుదిపేసే ఆ వార్త వెలువడింది!
నెతన్యాహు ఎందుకు వేచి చూశారు? గత ఫిబ్రవరి 25 మరియు 26 తేదీల్లో ప్రధాని మోదీ ఇజ్రాయెల్లో ఉన్నారు. ఆ రెండు రోజులూ ఇజ్రాయెల్ సైన్యం (IDF) మరియు మొసాద్ తమ ‘మెరుపు దాడి’ ప్రణాళికలన్నింటినీ పక్కన పెట్టాయి. దీనికి కారణాలు ఇవే:
- దౌత్య గౌరవం: భారత్ మరియు ఇరాన్ మధ్య దీర్ఘకాలిక సత్సంబంధాలు ఉన్నాయి. మోదీ ఇజ్రాయెల్ మట్టిపై ఉన్నప్పుడు ఇరాన్పై దాడి చేస్తే, అది భారత్ను ఇబ్బందికి గురిచేస్తుందని నెతన్యాహు భావించారు.
- భద్రతా వలయం: మోదీ అక్కడ ఉన్నప్పుడు ఇరాన్ ప్రతీకార దాడి చేస్తే, అది పెద్ద అంతర్జాతీయ సమస్యగా మారుతుంది. గగనతలాన్ని మూసివేయాల్సి వస్తుంది, ఇది మోదీ ప్రతిష్టకు భంగం కలిగిస్తుంది.
ఇజ్రాయెల్ వేసిన తిరుగులేని వ్యూహం మోదీ పర్యటనను ప్రపంచ మీడియా గమనిస్తున్న సమయంలో, శాంతి చర్చలు జరుగుతున్నట్లు ఒక భ్రమను కల్పించి, ఇరాన్ నాయకులను మోసం చేసి అందరినీ ఒకే చోటుకు రప్పించింది మొసాద్. ఇజ్రాయెల్ ఒక రకమైన పొగను సృష్టించి ప్రపంచ దేశాలను తప్పుదారి పట్టించింది.
వీడ్కోలు పలికిన వెంటనే వేట మొదలైంది! ఫిబ్రవరి 26 సాయంత్రం మోదీ ఇజ్రాయెల్ నుండి బయలుదేరారు. తర్వాతి 24 గంటలు ప్రశాంతంగా గడిచాయి. ఫిబ్రవరి 28 తెల్లవారుజామున 8:15 గంటలు… ప్రపంచం ఇంకా నిద్రలో ఉన్న సమయంలో, 200 యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలోకి దూసుకెళ్లాయి.
ఖమేనీ మరియు ఆయన కుటుంబ సభ్యులు శాంతి చర్చల గురించి చర్చించడానికి సమావేశమైన సమయంలోనే క్షిపణులు దూసుకువచ్చాయి. “మోదీ వచ్చి వెళ్లారు కదా, ఇప్పుడు పెద్ద దాడులు జరగవు” అని ఇరాన్ అప్రమత్తత కోల్పోయిన సమయాన్ని చూసి ఈ స్కెచ్ వేశారని దౌత్య నిపుణులు చెబుతున్నారు. ఒక్క దాడితో ఒకే పైకప్పు కింద ఉన్న అగ్ర నాయకులందరినీ తుడిచిపెట్టారు.
భారత్కు తెలుసా? “మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్త పరిస్థితులపై మోదీ-నెతన్యాహు చర్చించారు” అని విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఇప్పటికే పేర్కొన్నారు. అయితే, ఇంత పెద్ద దాడి ఇంత త్వరగా జరుగుతుందని భారత్కు తెలుసా? అన్నదే ఇప్పుడు మిస్టరీ. మోదీ ‘దౌత్య పర్యటన’ ముగిసిన వెంటనే ఇరాన్ ‘అధికార పీఠం’ కూలిపోయింది. ఇది యాదృచ్ఛికమా లేక పక్కా ప్రణాళికా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.
