“మౌనం వీడిన మహిళ, దూకిన డ్రైవర్!” లైంగికంగా వేధించినవాడికి బస్సు నడిరోడ్డుపై ‘ఫ్లయింగ్ కిక్’ ఇచ్చిన డ్రైవర్.. బెంగళూరు బస్సులో ఘోరం..!!”

బెంగళూరులోని అవుటర్ రింగ్ రోడ్‌లో నడుస్తున్న బిఎమ్‌టిసి బస్సులో ఒక మహిళా ప్రయాణికురాలికి లైంగిక వేధింపులు గురిచేసిన వ్యక్తిని ధైర్యవంతురాలైన ఆ మహిళ ఎదురించి పోరాడటంతో పాటు, బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ వ్యక్తిని చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హెబ్బాల్ నుండి మాన్యాటా టెక్ పార్క్ వైపు వెళ్తున్న 500D నంబరు గల ప్రభుత్వ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న ఒక యువతికి గుర్తుతెలియని వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేశాడు.

అయితే, దేనికీ భయపడిపోకుండా ఆ మహిళ తక్షణమే ఎదురు తిరిగి గళమెత్తింది.

మహిళ కేకలు విని వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ప్రవీణ్, వెంటనే వాహనాన్ని నడిరోడ్డుపై నిలిపివేసి ఆ వ్యక్తిని నేరుగా నిలదీశాడు. ఆ సమయంలో ఆ వ్యక్తి డ్రైవర్‌పైనే ఉమ్మివేయడంతో ఆగ్రహానికి గురైన డ్రైవర్ ప్రవీణ్, ఆ వ్యక్తి వైపు దూసుకెళ్లి ఫ్లయింగ్ కిక్ ఇచ్చాడు.

పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఇలాంటి బాధితులు మౌనం వహించకుండా ఎదురు ప్రశ్నించడం, డ్రైవర్ల వంటి సిబ్బంది ధైర్యంగా సహాయం చేయడం నేరాలను అరికట్టడానికి తోడ్పడతాయ అనడానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలిచింది.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకున్నారు.


Posted

in

by

Tags: