యముడిగా మారిన వేరుశనగ గింజ: సరదాగా మిక్చర్ తిన్న 3 ఏళ్ల బాలుడు మృతి; ఇలా జరగాలా? – విషాదం!

తిరువనంతపురం: కేరళలో సరదాగా మిక్చర్ తింటుండగా, అందులోని వేరుశనగ గింజ గొంతులో ఇరుక్కుని 3 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 5 ఏళ్ల లోపు పిల్లలు ఉన్నప్పుడు మరింత అప్రమత్తత అవసరం. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాలకే ప్రమాదంగా మారవచ్చు. ముఖ్యంగా పిల్లలకు ఆహారం ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఈ విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి: కేరళలోని మలప్పురం జిల్లా కున్నుంపురం గ్రామానికి చెందిన మునీర్ కు 3 ఏళ్ల కుమారుడు మహ్మద్ రిజాన్ ఉన్నాడు. రెండు రోజుల క్రితం ఇంట్లో మిక్చర్ తింటుండగా, అందులోని వేరుశనగ గింజ ఊహించని విధంగా బాలుడి గొంతులో ఇరుక్కుపోయింది. ఊపిరి ఆడక బాలుడు ఇబ్బంది పడ్డాడు. వెంటనే తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

పిల్లలకు ఏ ఆహారాన్ని ఎలా తినాలో తెలియదు. కాబట్టి, పిల్లలు తినేటప్పుడు తల్లిదండ్రులు దగ్గరుండి చూసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల ఇలాంటి దురదృష్టకర సంఘటనలను నివారించవచ్చు.


Posted

in

by

Tags: