రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్: తినడానికి తిండి లేక గడ్డితో సూప్ చేసుకుని తాగుతున్న ప్రజలు..! నెలల తరబడి నిలిచిపోయిన ఆహార సరఫరా.. రూ.150కి చేరిన ఒక్కో కోడిగుడ్డు ధర..!!!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో, ప్రస్తుతం రష్యా నియంత్రణలో ఉన్న ఉక్రెయిన్‌లోని ఒలెష్కీ (Oleshky) నగరంలో తీవ్ర మానవతా సంక్షోభం ఏర్పడినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

గత మే 26వ తేదీ నుంచి ఈ నగరానికి సాధారణ ఆహార పదార్థాల సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో అక్కడి ప్రజలు ఆకలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో ఒక్కో కోడిగుడ్డు ధర దాదాపు రూ.150 వరకు పలుకుతున్నట్లు తెలుస్తోంది.

తినడానికి ఆహారం దొరక్కపోవడంతో కొందరు ఆకులు, గడ్డితో సూప్ తయారు చేసుకుని తాగాల్సిన దుస్థితి ఏర్పడిందని అక్కడి నివేదికలు చెబుతున్నాయి. మరికొన్ని కుటుంబాలు ఆకలి తట్టుకోలేక పెంపుడు కుక్కలను సైతం తిన్నాయని ఒలెష్కీ నగర పరిపాలనా అధికారి ఒకరు వెల్లడించినట్లు స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి.

కేవలం ఆహారమే కాకుండా మందులు, తాగునీరు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలకు కూడా అక్కడ తీవ్ర కొరత ఏర్పడింది. నగరం చుట్టూ ఉన్న అనేక రహదారుల్లో ల్యాండ్‌మైన్లు (మందుపాతరలు) ఉండటంతో ఆ ప్రాంతం అత్యంత ప్రమాదకరంగా మారింది. ఫలితంగా ఆహార పదార్థాలను తరలించడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చడం చాలా కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు, సెప్టెంబర్ 27న డ్రోన్ల సహాయంతో ఒలెష్కీ నగరంలోని సుమారు 100 ప్రాంతాలకు దాదాపు 4 టన్నుల ఆహార పదార్థాలను చేరవేసినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. అయినప్పటికీ, నగరంలో నెలకొన్న ఆహార కొరత మరియు మానవతా సంక్షోభం ఇంకా ఆందోళనకరంగానే ఉందని నివేదికలు చేబుతున్నాయి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *