“రాత్రి 11 గంటలు.. స్టేషనరీ వస్తువులు కావాలని వెళ్తే.. 6వ తరగతి బాలికను దుకాణంలోకి లాక్కెళ్లి.. కాళ్లు, చేతులు కట్టేసి దారుణ అత్యాచారం. 56 ఏళ్ల కామాంధుడి అరెస్టు.!!”

ఢిల్లీలో దుకాణానికి వెళ్లిన 6వ తరగతి చదువుతున్న ఒక బాలికను బెదిరించి, కాళ్లు చేతులు కట్టేసి లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే.. గత సెప్టెంబర్ 16వ తేదీ రాత్రి పోలీసులకు ఒక అత్యవసర కాల్ వచ్చింది. అందులో, ఒక బాలికపై దుకాణదారుడు లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో.. రాత్రి 11 గంటల ప్రాంతంలో అదే ప్రాంతంలో నివాసం ఉండే 6వ తరగతి చదువుతున్న బాలిక తన ఇంటి నుంచి స్టేషనరీ వస్తువులు కొనుగోలు చేసేందుకు బయటకు వచ్చింది. అప్పుడు, అక్కడే టైలరింగ్ షాపు నడుపుతున్న 56 ఏళ్ల మక్సూద్ అనే వ్యక్తి, బాలికకు మాయమాటలు చెప్పి తన దుకాణంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమె కాళ్లు, చేతులు కట్టేసి, అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడినట్లు తేలింది.

బాధిత బాలిక ఫిర్యాదు మేరకు, మహిళా పోలీస్ స్టేషన్‌లో కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సమాచారం అందిన వెంటనే స్పందించిన పోలీసులు, 56 ఏళ్ల నిందితుడు మక్సూద్‌ను అరెస్టు చేసి అదే రోజు జ్యుడీషియల్ కస్టడీకి (రిమాండ్‌కు) తరలించారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలపై పోలీస్ శాఖ నిరంతరం కఠిన చర్యలు తీసుకుంటోందని, ఈ కేసును కూడా అత్యంత శ్రద్ధతో, సున్నితంగా విచారిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *