రాణిపేట జిల్లా కావేరిపాక్కం సమీపంలోని ఆయర్‌పాడి ప్రాంతానికి చెందిన కళాశాల విద్యార్థి గోకులకృష్ణన్ (19), అదే ప్రాంతానికి చెందిన నక్షత్ర (18) అనే యువతిని గత రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు.
నిన్న రాత్రి గోకులకృష్ణన్ తన ప్రియురాలిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న నక్షత్ర తల్లి మహమ్మద్ తమీమ్, తన కూతురితో మాట్లాడటం మానుకోవాలని అతడికి చెప్పింది. దానికి గోకులకృష్ణన్.. నక్షత్రను తనకు ఇచ్చి పెళ్లి చేయాలని కోరాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లి, ఇంట్లోకి వెళ్లి బాగా కాచిన వేడి నూనెను తీసుకొచ్చి గోకులకృష్ణన్ ముఖంపై పోసింది.
దీంతో తీవ్రంగా గాయపడి కేకలు వేసిన గోకులకృష్ణన్‌ను చుట్టుపక్కల వారు రక్షించి, వెంటనే వాలాజా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వెల్లూరు అడుక్కంపారై ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై కావేరిపాక్కం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply