రాత్రి సమయం..! భార్యాభర్తల మధ్య చెలరేగిన గొడవ. ఆవేశంలో భర్త చేసిన దారుణం.. 7 నెలల పసిపాపను కూడా వదల్లేదు. వణికించే భయంకర దృశ్యం..!

కర్ణాటక రాష్ట్రం బళ్లారి ప్రాంతంలో కొన్నోరు స్వామి అనే వ్యక్తి నివాసముంటున్నాడు. ఇతనికి వివాహమై రాజేశ్వరి అనే భార్య, ఏడు నెలల అశ్విని అనే పాప ఉన్నారు.

దీనిలో భార్యాభర్తల మధ్య తరచూ కుటుంబ తగవులు జరుగుతుండేవని చెబుతుండగా నిన్న గొడవ తీవ్రరూపం దాల్చింది.

భార్యాభర్తల మధ్య వాగ్వాదం ఘర్షణగా మారడంతో ఆవేశంలో భర్త తన భార్యను ఇంట్లోని సుత్తితో దారుణమైన రీతిలో కొట్టి చంపాడు. అనంతరం తన ఏడు నెలల పసిపాపను కూడా వదలకుండా సుత్తితో దారుణంగా కొట్టి చంపేశాడు.

ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యకు గల కారణం ఇప్పటివరకు తెలియరాని నేపథ్యంలో పరారీలో ఉన్న కొన్నోరు స్వామి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *