రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అది యూరిక్ యాసిడ్ పెరిగినట్లు సంకేతం కావచ్చు!

మన శరీరంలో సహజంగా తయారయ్యే ఒక వ్యర్థ పదార్థమే యూరిక్ యాసిడ్. మనం తీసుకునే ఆహారంలోని ‘ప్యూరిన్’ అనే అంశం విచ్ఛిన్నమైనప్పుడు ఇది ఏర్పడుతుంది. సాధారణంగా కిడ్నీలు దీనిని వడపోసి బయటకు పంపుతాయి. కానీ, కొన్నిసార్లు శరీరంలో దీని స్థాయి పెరిగిపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు శరీరం కొన్ని లక్షణాల ద్వారా హెచ్చరిస్తుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో గమనించాల్సిన లక్షణాలు ఇవే:

1. కీళ్లలో తీవ్రమైన నొప్పి: రాత్రి సమయంలో కీళ్లలో విపరీతమైన నొప్పి ఉంటే అది యూరిక్ యాసిడ్ పెరిగినట్లు ప్రధాన సంకేతం. యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు, అది స్పటికాలుగా (Crystals) మారి కీళ్లలో పేరుకుపోతుంది. దీనివల్ల చీలమండలు, మడమలు, మోకాళ్లలో కఠినమైన నొప్పి వస్తుంది.

2. వాపు మరియు ఎరుపు ఎక్కడం: కీళ్లలో నొప్పి మాత్రమే కాకుండా వాపు, ఎరుపు రంగులోకి మారడం, మంట వంటివి కూడా యూరిక్ యాసిడ్ లక్షణాలే. రాత్రిపూట ఒకే భంగిమలో ఎక్కువసేపు పడుకోవడం వల్ల రక్త ప్రసరణ తగ్గి కీళ్లు పట్టేస్తాయి. ఉదయం నిద్రలేవగానే కాళ్లు కదిలించడం కూడా కష్టంగా అనిపించవచ్చు.

3. కాళ్లలో మంట మరియు తిమ్మిర్లు: అరికాళ్లలో విపరీతమైన మంట, నొప్పి, కాళ్లకు నిప్పు అంటుకున్నట్లు అనిపించడం లేదా తిమ్మిర్లు రావడం యూరిక్ యాసిడ్ పెరగడానికి సూచన కావచ్చు. అలాగే యూరిక్ యాసిడ్ స్పటికాలు వెన్నెముకలో చేరితే తీవ్రమైన నడుము నొప్పికి కూడా దారితీస్తుంది.

4. తరచుగా మూత్ర విసర్జన: శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు అది కిడ్నీలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల రాత్రిపూట పదేపదే మూత్రానికి వెళ్లాలని అనిపిస్తుంది. అయితే, వెళ్లిన ప్రతిసారీ తక్కువ పరిమాణంలోనే మూత్రం వస్తుంది. బ్లాడర్ పూర్తిగా ఖాళీ అవ్వలేదన్న భావన వల్ల మళ్లీ మళ్లీ వెళ్లాల్సి వస్తుంది.

5. విపరీతంగా చెమటలు పట్టడం: యూరిక్ యాసిడ్ వల్ల కలిగే వాపు, నొప్పి నరాల వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల రాత్రిపూట విపరీతంగా చెమటలు పట్టడం లేదా కారణం లేకుండానే అసౌకర్యంగా అనిపించడం జరుగుతుంది. కొన్నిసార్లు చర్మ సమస్యలు కూడా తలెత్తవచ్చు.

ముఖ్య గమనిక: పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు సొంత వైద్యం చేసుకోకుండా తప్పనిసరిగా డాక్టరును సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. ఆ తర్వాతే వ్యాధిని నిర్ధారించుకోవడం మంచిది.


Posted

in

by

Tags: