సోషల్ మీడియాలో ఎలాగైనా వైరల్ కావాలనే పిచ్చితో నేటి యువత చేసే పిచ్చి పనులు, ప్రమాదకర విన్యాసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
ఈ క్రమంలో, బీహార్ రాష్ట్రంలో ఒక యువకుడు రీల్స్ వీడియో కోసం ఏకంగా పెట్రోల్ తాగిన దృశ్యాలతో కూడిన షాకింగ్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో దావానలంలా వైరల్ అవుతోంది.
బీహార్లో చిత్రీకరించినట్లుగా భావిస్తున్న ఈ వీడియోలో, ఒక యువకుడు తన స్నేహితుల కెమెరా ముందు రీల్స్ (Reels) చేయడం కోసం ఏమాత్రం వెనుకాడకుండా పెట్రోల్ తాగడం, ఆ తర్వాత అతడు తీవ్ర ఇబ్బంది పడటం కనిపించింది. సామాజిక మాధ్యమాలలో వ్యూస్, లైకుల కోసం ప్రాణాలను పణంగా పెట్టి యువత ఇలాంటి ప్రమాదకర చేష్టలకు పాల్పడటంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం, విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply