దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న వేళ, సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన మరియు ఆలోచింపజేసే వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.
“మీ ముందు ఒకవైపు మువ్వన్నెల జాతీయ పతాకం, మరోవైపు రూ.500 నోటు పెడితే మీరు దేన్ని ఎంచుకుంటారు?” అనే ప్రశ్నకు జనం ఇచ్చిన సమాధానాలు ప్రస్తుతం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
నెట్టింట వైరల్ అవుతున్న ఈ ‘సోషల్ ఎక్స్పెరిమెంట్’ వీడియోలో ఒక కంటెంట్ క్రియేటర్ సామాన్య ప్రజలను, అధికారులను కలిసి ఈ ప్రశ్న అడుగుతాడు.
మొదటగా ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ వినోద్ కుమార్ పాండే వద్దకు వెళ్లి ఆయన ముందు రూ.500 నోటు, జాతీయ జెండా ఉంచుతారు. “రెండింటిలో దేన్ని ఎంచుకుంటారు?” అని అడగ్గానే, ఆయన ఏమాత్రం తడుముకోకుండా ఎంతో గర్వంగా… “మేం ఎప్పుడూ జాతీయ జెండానే ఎంచుకుంటాం… మాకు డబ్బులు చూపించడమేంటి?” అని ధీటుగా సమాధానమిచ్చారు. ఆ పోలీసు అధికారి చెప్పిన దేశభక్తి సమాధానం లక్షలాది మంది హృదయాలను గెలుచుకుంది.
ఈ పరీక్షలో పోలీసులే కాకుండా విద్యార్థులు, ఈ-రిక్షా డ్రైవర్లు, దినసరి కూలీలు మరియు ఆలయ పూజారి కూడా పాల్గొన్నారు. సైకిల్‌పై వెళ్తున్న కొందరు విద్యార్థులు కాస్త తటపటాయించినా… కష్టపడి పనిచేసే ఈ-రిక్షా డ్రైవర్లు, నిరుపేద కూలీలు డబ్బుల కంటే జాతీయ జెండానే మిన్న అని ఎంచుకోవడం విశేషం. అలాగే ఆలయ పూజారి కూడా చిరునవ్వుతో జాతీయ జెండాకే మొదటి ప్రాధాన్యతనిచ్చారు. డబ్బుల కంటే దేశ గౌరవమే గొప్పదని వీరంతా నిరూపించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయిన ఈ వీడియో ఇప్పటివరకు 48 లక్షలకు పైగా వ్యూస్‌ను, 1.8 లక్షల లైకులను కొల్లగొట్టింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “నేనైతే రూ.500 నోటు తీసుకుని, అందులో కొద్ది మొత్తంతో జెండా కొనుక్కుని మిగతా డబ్బులు దాచుకునేవాడిని” అని ఒకరు ఫన్నీగా కామెంట్ చేయగా… “ఒకవేళ కెమెరా ముందు లేకపోతే చాలామంది నిర్ణయం వేరేలా ఉండేదేమో?” అని మరొకరు రాసుకొచ్చారు. ఏది ఏమైనా, స్వాతంత్య్ర దినోత్సవ వేళ ప్రజల్లోని దేశభక్తిని చాటిచెప్పిన ఈ వీడియో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply