“రూ. 6.5 కోట్లు!” సముద్ర తీరం కనిపిస్తూ 900 చదరపు అడుగుల్లో అద్భుతమైన ఇల్లు… కానీ శాకాహారులకు మాత్రమే విక్రయం! వింత ప్రకటనతో చెలరేగిన వివాదం… క్షమాపణలు కోరిన బ్రోకర్!

ముంబైలోని తార్డియో ప్రాంతంలో రూ. 6.5 కోట్ల విలువైన రెండు పడకగదుల (2 BHK) ఫ్లాట్ విక్రయానికి సంబంధించి ప్రకటన ఇచ్చారు.

సుమారు 900 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఇల్లు, నగరాన్ని మరియు సముద్ర తీరాన్ని వీక్షించేలా విశాలమైన బాల్కనీతో రూపొందించబడిందని వెల్లడించారు. అంతేకాకుండా, వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలం కూడా ఉందన్నారు. దక్షిణ ముంబైలోని కీలక ప్రాంతంలో ఉండటంతో ఈ ఇల్లు చాలామంది దృష్టిని ఆకర్షించింది.

అయితే, ఈ ఇంటికి సంబంధించిన ప్రమోషన్ వీడియోలో, “శాకాహారం (Pure Veg) తినే వారికి మాత్రమే ఇల్లు అమ్మబడుతుంది” అనే షరతును పేర్కొన్నారు. ఈ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇల్లు కొనుగోలు చేసే వ్యక్తి ఆహార అలవాట్ల ఆధారంగా నిబంధనలు విధించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న తలెత్తింది. దీంతో ఈ ఇల్లు విక్రయ ప్రకటన తీవ్ర వివాదాస్పదంగా మారింది.

ఈ వ్యవహారంపై స్పందించిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ భవేష్ గవారే మాట్లాడుతూ, తాను స్వయంగా మాంసాహారినని, శాకాహారులకు మాత్రమే ఇల్లు అనే నిబంధన తనది కాదని వివరణ ఇచ్చారు. ఇంటి యజమాని కోరిక మేరకే ఆ షరతును వీడియోలో పేర్కొన్నట్లు తెలిపారు. అంతేకాకుండా తన వీడియోను తప్పుగా అర్థం చేసుకున్నారని, మాంసాహారులను బాధింపజేసే ఉద్దేశం తనకు లేదన్నారు.

ఈ అంశంపై వచ్చిన విమర్శలకు భవేష్ గవారే స్పందిస్తూ, తన మాటల వల్ల ఎవరి మనసైనా నొచ్చుకుని ఉంటే క్షమించాలని కోరారు. ఇల్లు విక్రయానికి సంబంధించిన వివరాలను మాత్రమే తాను వెల్లడించానని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ, ఇళ్ల విక్రయం మరియు అద్దెల విషయంలో ఆహార అలవాట్లను బట్టి ఆంక్షలు విధించడంపై ఈ సంఘటన మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో ముంబై రియల్ ఎస్టేట్ రంగంలో వ్యక్తిగత స్వేచ్ఛ, సమానత్వం అంశాలపై పలు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *