రైలు ప్రయాణికులకు షాక్ ఇచ్చేలా భారతీయ రైల్వే కొత్త సంస్కరణను ప్రవేశపెట్టింది. ఇక నుంచి మీరు టికెట్ బుక్ చేసుకున్న బోర్డింగ్ స్టేషన్లో సరైన సమయానికి చేరుకోకపోతే, మీ సీటు క్షణాల్లో మరొకరి సొంతమవుతుంది.
రైల్వే తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం, టీటీఈ (TTE) ఇకపై మీ కోసం తదుపరి స్టేషన్ వరకు వేచి చూడరు.
పాత నిబంధన vs కొత్త నిబంధన: ప్రస్తుత చట్టం ప్రకారం, ఒక ప్రయాణికుడు బోర్డింగ్ స్టేషన్లో రైలు ఎక్కకపోతే, తదుపరి స్టేషన్ దాటే వరకు టీటీఈ ఆ సీటును ఎవరికీ కేటాయించేవారు కాదు. కానీ కొత్త నిబంధన అమలులోకి రావడంతో, టీటీఈ తన వద్ద ఉన్న టాబ్లెట్‌లో మీరు రాలేదన్న సమాచారాన్ని (No-show) వెంటనే నమోదు చేస్తారు. నిమిషాల వ్యవధిలోనే ఆ సీటు వెయిటింగ్ లిస్ట్ (Waiting List) లో ఉన్న వారికి లేదా ఆర్ఏసీ (RAC) టికెట్ ఉన్న వారికి ఆటోమేటిక్‌గా బదిలీ చేయబడుతుంది.
మీ సీటు మరొకరికి కేటాయించబడిన వెంటనే, ఆ సమాచారం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ (SMS) ద్వారా అందుతుంది. రైల్వే డిజిటల్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు.
