“రైలులో ఇకపై గట్టిగా పాటలు వింటే 6 నెలల జైలు!” దక్షిణ రైల్వే సంచలన ప్రకటన.. ₹5,000 జరిమానా లేదా కఠిన కారాగార శిక్ష!

రైళ్లలో ఇకపై ప్రయాణికులు ఇతరులకు అసౌకర్యం కలిగించేలా పెద్ద శబ్దంతో (లౌడ్ స్పీకర్‌లో) పాటలు విన్నా, సహ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించినా ₹5,000 వరకు జరిమానా లేదా 6 నెలల వరకు జైలు శిక్ష విధించనున్నట్లు దక్షిణ రైల్వే (Southern Railway) కీలక ప్రకటన చేసింది.

ఈ కొత్త నిబంధన ప్రకారం, తొలుత నిబంధనలు ఉల్లంఘించిన వారికి హెచ్చరికతో పాటు ₹1,000 జరిమానా విధిస్తారు. అయినప్పటికీ తీరు మార్చుకోకుండా అదేవిధంగా ప్రవర్తిస్తే.. రైల్వే చట్టం సెక్షన్ 145(2) కింద 6 నెలల వరకు జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు.

రైలు ప్రయాణాల్లో ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే ప్రయాణికులు వెంటనే రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139 ద్వారా కానీ, రైలులో అందుబాటులో ఉండే అధికారులకు కానీ నేరుగా ఫిర్యాదు చేయవచ్చని రైల్వే శాఖ స్పష్టం చేసింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *