ఉరుకుల పరుగుల జీవనశైలి వల్ల కలిగే అలసట, కండరాల బలహీనతను దూరం చేసి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సరైన పోషకాహారం ఎంతో ముఖ్యం.
కండరాలను దృఢంగా మార్చుకోవడానికి, రోజంతా ఉల్లాసంగా ఉండటానికి మార్కెట్లో దొరికే ఖరీదైన సప్లిమెంట్లకు బదులుగా ఇంట్లోనే ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తయారుచేసుకుని తీసుకోవచ్చు.
డ్రై ఫ్రూట్స్ కలిపిన ‘గ్రీక్ పెరుగు’ ఒక అద్భుతమైన శీఘ్ర అల్పాహారం. ముప్పావు కప్పు గ్రీక్ పెరుగులో బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్, కొద్దిగా తేనె మరియు బెర్రీ పండ్లను కలుపుకుని తింటే శరీరానికి అవసరమైన తక్షణ ప్రొటీన్ లభిస్తుంది.
‘అవకాడో ఎగ్ టోస్ట్’ మరొక ప్రొటీన్ సమృద్ధిగా ఉండే అల్పాహారం. హోల్ వీట్ బ్రెడ్‌ను కాల్చి, దానిపై మెత్తగా చేసిన అవకాడో మిశ్రమాన్ని పూసి, వెన్నలో ఉడికించిన గుడ్డును ఉంచి మిరియాల పొడి చల్లుకుని తింటే శరీరానికి మంచి పోషకాలు అందుతాయి.
ఉదయం వేళ హడావుడిగా ఆఫీసులకు వెళ్లేవారు ‘చియా సీడ్స్ పుడ్డింగ్’ సిద్ధం చేసుకోవచ్చు. చియా గింజలు, పాలు మరియు ప్రొటీన్ పౌడర్ (లేదా పీనట్ బటర్) రాత్రే కలిపి ఫ్రిజ్‌లో ఉంచి, ఉదయాన్నే డ్రై ఫ్రూట్స్ జోడించి తీసుకోవచ్చు. లేదా గ్రీక్ పెరుగులో పండ్లు, కొద్దిగా నీరు కలిపి ‘ప్రొటీన్ స్మూతీ’లా కూడా తాగవచ్చు.
‘పన్నీర్ పాన్కేక్’ రుచి మరియు పోషకాలు నిండిన మరొక ఉత్తమ బ్రేక్‌ఫాస్ట్. పన్నీర్, గుడ్డు, పెరుగు, తేనె మరియు ఓట్స్ పిండిని కలిపి మెత్తగా రుబ్బుకుని, పెనంపై పాన్‌కేక్‌లుగా కాల్చుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన ప్రొటీన్ బ్రేక్‌ఫాస్ట్‌ను సులభంగా పొందవచ్చు.

Leave a Reply