లిప్ లాక్ కిస్..! ప్రేమ జంట పీక్ రొమాన్స్: లోకాన్ని మరిచిపోయి ఏకంగా గోతిలో పడ్డారు.. వీడియో వైరల్!!

సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక వింత వీడియోలు వైరల్ కావడం సహజం. ఆ క్రమంలో, రోడ్డు పక్కన రొమాన్స్‌లో మునిగిపోయిన ఒక ప్రేమ జంట, ఊహించని విధంగా పట్టు తప్పి కింద పడిపోయిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో, ఒక యువ జంట రోడ్డు పక్కన నిలబడి ఒకరినొకరు కౌగిలించుకుని రొమాన్స్ చేసుకుంటున్నారు. ఒకానొక సమయంలో లోకాన్నే మరిచిపోయి, తమ చుట్టూ ఉన్న పరిసరాలను కూడా గమనించకుండా ముద్దుల్లో మునిగిపోయారు. ఆ సమయంలో, అనుకోకుండా వెనక్కి వాలడంతో ఇద్దరూ నియంత్రణ కోల్పోయి, వెనుక ఉన్న ఒక లోతైన గుంతలో (పల్లంలో) పడిపోయారు. వారు పడిపోయిన వేగంతోనే ఆ వీడియో ముగుస్తుంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లను పంచుకుంటున్నారు. “ప్రేమలో పడటం గురించి విన్నాం కానీ, ఇలా పడటం ఇప్పుడే చూస్తున్నాం” అని ఒకరు కిండల్ చేస్తూ పోస్ట్ చేశారు. మరికొందరేమో, “ఈ వీడియో చూస్తుంటే నవ్వు ఆపుకోలేకపోతున్నాం, చాలా ఫన్నీగా ఉంది” అని పేర్కొన్నారు. ఇంకా కొందరు, “ఎవరి గురించి పట్టించుకోకుండా తమ లోకంలో విహరిస్తున్న వీరి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే” అని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా, బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని మరికొందరు సూచిస్తున్నారు.


Posted

in

by

Tags: