లైవ్ స్ట్రీమ్‌లో 80,000 మంది చూస్తుండగా 140 కిలోమీటర్ల వేగంతో కారు ప్రమాదం.. ఐసీయూలో అనురాగ్ డోభాల్!

బిగ్ బాస్ 17 కంటెస్టెంట్, యూట్యూబర్ అనురాగ్ డోభాల్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చేస్తూ తన కారును ప్రమాదానికి గురిచేయడం ద్వారా రెండోసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీన్ని తన ‘చివరి ప్రయాణం’ (Final Drive) అని పేర్కొంటూ, వేలాది మంది ఫాలోవర్లకు ‘గుడ్ బై’ చెప్పి కారును బారియర్‌కు ఢీకొట్టారు. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలోని ఐసీయూలో ఉన్నట్లు మేనేజర్ ధృవీకరించారు.

అసలేం జరిగింది? నివేదికల ప్రకారం, అనురాగ్ ఘజియాబాద్‌లోని ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై తన టయోటా ఫార్చ్యూనర్ కారులో అత్యంత వేగంగా వెళ్తూ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ఇచ్చారు. కన్నీళ్లు పెట్టుకుంటూ.. “నేను మళ్ళీ పుట్టినప్పుడైనా అమ్మ నాకు ప్రేమను ఇవ్వాలని కోరుకుంటున్నాను.. నాకు ఎవరూ లేరు” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో సుమారు 80,000 మంది ఆయన లైవ్‌ను చూస్తున్నారు. స్పీడోమీటర్ 140-150 కిలోమీటర్ల వేగాన్ని చూపిస్తుండగా, “ఇక సెలవు” (And it’s a goodbye) అని అరుస్తూ కారును బారియర్‌కు ఢీకొట్టారు.

ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్: అనురాగ్ మేనేజర్ సోషల్ మీడియాలో ప్రకటన విడుదల చేస్తూ.. “అనురాగ్ ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన్ను మరో ఆసుపత్రికి తరలించాము, ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. దయచేసి ఆయన కోసం ప్రార్థించండి. ఆయన లొకేషన్‌ను కనుగొని సాయం చేసిన అభిమానులకు ధన్యవాదాలు” అని తెలిపారు.

కొద్దిరోజుల్లోనే రెండో ప్రయత్నం: కొన్ని రోజుల క్రితమే అనురాగ్ తనకు మానసిక వేధింపులు జరుగుతున్నాయని ఒక నోట్ షేర్ చేశారు. తన కులాంతర వివాహం ఇంట్లో వారికి ఇష్టం లేదని, తన భార్య రితికను ఇంట్లోకి రానివ్వడం లేదని తన తల్లిదండ్రులు, తోబుట్టువులపై ఆరోపణలు చేశారు. అయితే, అనురాగ్ సోదరుడు కలమ్ ఇంక్ స్పందిస్తూ.. ఇవన్నీ వ్యూస్ (Views) కోసం చేస్తున్న వన్ సైడ్ ఆరోపణలని కొట్టిపారేశారు.


Posted

in

by

Tags: