వంటగదిలో ఆహార పదార్థాలు ఉంచే చోట మార్కెట్లో దొరికే రసాయన స్ప్రేలను ఉపయోగించడం ఆరోగ్యానికి ఏమాత్రం సురక్షితం కాదు. అటువంటి సమయంలో మన ఇంట్లో దొరికే సాధారణ వస్తువులతో తయారుచేసే సహజసిద్ధమైన చిట్కాలు బాగా పనిచేస్తాయి.
కావలసిన పదార్థాలు:
- టీ పొడి – 2 టీస్పూన్లు
- టూత్ పేస్ట్ – 1 స్పూన్
- బేకింగ్ సోడా – 1 స్పూన్
- బేకింగ్ పౌడర్ – 1 స్పూన్
తయారీ విధానం: ఒక గిన్నెలో రెండు టీస్పూన్ల టీ పొడి తీసుకోండి. అందులో ఒక స్పూన్ టూత్ పేస్ట్, ఒక స్పూన్ బేకింగ్ సోడా మరియు ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండ్రాలుగా (ఉండలుగా) చేసుకోవాలి. ఈ ఉండల నుండి వచ్చే వాసన బల్లులను, బొద్దింకలను ఆకర్షిస్తుంది. కానీ, వీటిని తిన్నప్పుడు వాటి జీర్ణవ్యవస్థ దెబ్బతిని అవి చనిపోతాయి.
ఉపయోగించే విధానం: ఈ చిన్న ఉండలను వంటగదిలోని క్యాబినెట్లలో లేదా బొద్దింకలు, బల్లుల సంచారం ఎక్కువగా ఉన్న చోట ఉంచాలి. ఒకవేళ ఈ ఉండలు తయారుచేయడానికి సమయం లేకపోతే.. టీ పొడిని నీళ్లలో మరిగించి, ఆ నీటిలో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కలిపి వడకట్టాలి. ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్లో పోసి, బొద్దింకలు ఉన్న చోట స్ప్రే చేయవచ్చు.
