వదినతో మరిది అక్రమ సంబంధం.. పెళ్లి వార్త వినగానే మరణ శాసనం రాసిన వదిన!

రాంచీ గ్రామీణ ప్రాంతమైన తమాడ్‌లో అక్రమ సంబంధం దారుణ హత్యకు దారితీసింది. తన మరిది (ప్రియుడు) వేరే పెళ్లి చేసుకుంటున్నాడనే కోపంతో, ఒక మహిళ తన భర్తతో కలిసి అతడికి టీలో విషం ఇచ్చి చంపేసింది. 48 గంటల్లోనే పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే: తమాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోధ్మా గ్రామంలో ఈ ఘటన జరిగింది. 35 ఏళ్ల గీతా దేవికి తన వరుసకు మరిది అయ్యే శంకర్ నాయక్‌తో గత మూడేళ్లుగా అక్రమ సంబంధం ఉంది. శంకర్ తల్లిదండ్రులు చనిపోవడంతో గీతా దేవి అతడి ఇంటి పనులను చూసుకునేది. ఈ క్రమంలోనే వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అయితే, ఇటీవల శంకర్ మరో యువతితో వివాహం నిశ్చయం చేసుకోవడం గీతా దేవికి నచ్చలేదు. దీంతో అతడిని అడ్డుతొలగించుకోవాలని పథకం పన్నింది.

టీలో విషం కలిపి హత్య: పథకం ప్రకారం శంకర్‌ను టీ తాగడానికి ఇంటికి పిలిచారు. టీలో విషం కలిపి ఇచ్చారు. శంకర్ ఆరోగ్యం క్షీణించడంతో జంషెడ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు, కానీ చికిత్స పొందుతూ అతను మరణించాడు. శంకర్ సోదరుడు సుక్రా నాయక్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టి, కాల్ డేటా మరియు మొబైల్ లొకేషన్ ఆధారంగా గీతా దేవి మరియు ఆమె భర్త బలదేవ్ మచువాను అరెస్ట్ చేశారు. వీరితో పాటు వీరి మైనర్ కుమార్తె పాత్రపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.


Posted

in

by

Tags: