అడల్ట్ స్టార్ బోనీ బ్లూ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె అత్యంత వివాదాస్పదమైన ఒక ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. దీనికి ఆమె ‘క్యాటిల్ బ్రీడింగ్’ (Cattle Breeding) అని పేరు పెట్టారు. దీని ద్వారా ఎంతమంది పురుషులైనా ఆమెతో లైంగిక సంబంధం కలిగి ఉండవచ్చని ప్రకటించారు.
12 గంటల్లో 1000 మంది పురుషులతో.. ఈ ఈవెంట్ ద్వారా బోనీ బ్లూ ఒక ప్రపంచ రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 26 ఏళ్ల బోనీ (అసలు పేరు టియా బిలింగర్) గతంలో 12 గంటల్లో 1000 మంది పురుషులతో పాల్గొని రికార్డు సృష్టించినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరిలో జరగబోయే ఈ కొత్త ఈవెంట్ గురించి సోషల్ మీడియాలో ప్రకటించగానే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో ఇండోనేషియాలో ఒక వివాదం కారణంగా ఆమె ఆ దేశాన్ని వదలాల్సి వచ్చింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో వైరల్ తన కెరీర్‌లోని ఒక రికార్డు వార్షికోత్సవం సందర్భంగా ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో తెలిపారు. అయితే, నెటిజన్లు దీనిని పబ్లిసిటీ స్టంట్ అని, అభ్యంతరకరమని విమర్శిస్తున్నారు. విమర్శలు వస్తున్నప్పటికీ, ఈ ఈవెంట్ టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచబడ్డాయి.
రాజకీయాల్లోకి రానని స్పష్టీకరణ ఒక ఇంటర్వ్యూలో బ్రిటన్ రాజకీయాల గురించి మాట్లాడుతూ.. ఒక రాజకీయ నాయకుడికి మద్దతు తెలుపుతున్నానని, కానీ తాను మాత్రం రాజకీయాల్లోకి రానని బోనీ బ్లూ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె చుట్టూ వివాదాలు నడుస్తున్నప్పటికీ, సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు.
