వర్షం కురుస్తోందని ఆశ్రయం పొందితే.. వంచించి వల వేశారు! 13 ఏళ్ల బాలికపై మృగాళ్ల వికృత క్రీడ.. కాళ్లు చేతులు కట్టేసి ఐదుగురు మృగాళ్ల సామూహిక అత్యాచారం!

లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఆషియానా ప్రాంతంలో సభ్య సమాజం తలదించుకునే దారుణం వెలుగుచూసింది. వర్షం నుంచి తప్పించుకోవడానికి ఒక నిర్మాణంలో ఉన్న భవనంలోకి వెళ్లిన 13 ఏళ్ల మైనర్ బాలికపై ఐదుగురు కామాంధులు పైశాచికత్వానికి ఒడిగట్టారు. కాళ్లు, చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఆ చిన్నారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

వర్షమే శాపమైంది!

కన్నౌజ్ జిల్లాకు చెందిన ఒక నిరుపేద కుటుంబం లక్నోలో వలస ఉంటూ బతుకుదెరువు సాగిస్తోంది. బాలిక తండ్రి మేస్త్రీగా, తల్లి ఇళ్లలో పనిమనిషిగా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి తల్లికి ఒంట్లో బాలేకపోవడంతో, బాలిక తన తల్లికి బదులుగా పనికి వెళ్లి తిరిగి వస్తోంది. ఆ సమయంలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం మొదలైంది. తడవకుండా ఉండేందుకు దారిలో ఉన్న ఒక నిర్మాణంలో ఉన్న భవనం కింద ఆ చిన్నారి తలదాచుకుంది.

బలి తీసుకున్న కామపిశాచులు

అక్కడ అప్పటికే మాటువేసిన 17 ఏళ్ల మైనర్ బాలుడు, అతని నలుగురు స్నేహితులు బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించారు. ఆ చిన్నారిని చుట్టుముట్టి లోపలికి లాక్కెళ్లారు. బాలిక ప్రతిఘటించడంతో ఆగ్రహం చెందిన ఆ మృగాలు ఆమెపై దాడి చేశాయి. అరుపులు బయటకు వినపడకుండా నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు చేతులు కట్టేసి ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు.

తల్లిదండ్రుల ఎంట్రీ.. రెండో అంతస్తు నుంచి దూకిన నిందితులు!

రాత్రి ఎంతకీ కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెతుక్కుంటూ అటుగా వచ్చారు. నిర్మాణంలో ఉన్న భవనం వద్ద అనుమానం వచ్చి లోపలికి వెళ్లారు. తమ గుట్టు రట్టవుతుందని భయపడిన ఆ కామపిశాచులు భవనం రెండో అంతస్తు నుంచి కిందకు దూకి పారిపోయే ప్రయత్నం చేశారు.

  • ఇద్దరు పట్టుబడ్డారు: పైనుంచి దూకడంతో ఇద్దరు నిందితులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
  • విషాద దృశ్యం: లోపలికి వెళ్లి చూసిన తల్లిదండ్రులకు తమ కూతురు సగం నగ్నంగా, స్పృహలేని స్థితిలో కాళ్లు చేతులు కట్టేసి కనిపించడంతో గుండె పగిలేలా రోదించారు. ప్రస్తుతం ఆ బాలిక లోక్ బంధు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది.

Posted

in

by

Tags: