వాకింగ్‌కు వెళ్లిన మహిళ! నగలు లాక్కోవడానికి వచ్చి తీవ్రంగా కొట్టిన యువకులు… తెల్లవారుజామున జరిగిన ఘోరం! భయాందోళన కలిగిస్తున్న సీసీటీవీ విజువల్స్!

కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని పీణ్యా పరిధిలో ఉన్న తొడ్డబిడరకల్లు ప్రాంతంలో, జయమ్మ అనే మహిళ బుధవారం తెల్లవారుజామున అలవాటు ప్రకారం వాకింగ్ చేస్తోంది.

ఆ సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు అపరిచిత వ్యక్తులు, జయమ్మను అడ్డుకుని ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కోవడానికి ప్రయత్నించారు.

ఆ సమయంలో జయమ్మ వారిని ఎదుర్చి పోరాడటంతో, ఆగ్రహానికి గురైన దొంగలు ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో జయమ్మ ముఖం, మెడ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బెంగళూరు నగర పోలీసులు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ దొంగల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *