“వార్నర్, స్మిత్ వంటి దిగ్గజాలనే గడగడలాడించిన బౌలర్!”.. ఢిల్లీ ఎన్‌సీఆర్ ఆసుపత్రిలో కన్నుమూసిన క్రికెట్ లెజెండ్. విషాదంలో మునిగిపోయిన అభిమానులు..!!!!

ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ స్టార్ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్, ‘హెమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్’ అనే అరుదైన మరియు తీవ్రమైన వ్యాధితో సుదీర్ఘకాలంగా పోరాడుతూ మృతి చెందారు. మెదడు వరకు విస్తరించిన ఈ తీవ్రమైన ఇన్ఫెక్షన్ చికిత్స కోసం, గత కొన్ని నెలలుగా ఆయన భారత్‌లోని ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR) ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆయన వైద్య ఖర్చుల కోసం ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్లు, స్నేహితులు వివిధ రకాలుగా సహాయం చేస్తూ, ఆయన కోలుకోవాలని ప్రార్థించారు. అయినప్పటికీ, చికిత్స పొందుతూ 38 ఏళ్ల వయసులో ఢిల్లీలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన అకాల మరణం ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ వర్గాలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

షాపూర్ జద్రాన్ మరణాన్ని ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) అధికారికంగా ధృవీకరించింది. “షాపూర్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఎంతో గౌరవం, ధైర్యం మరియు గర్వంతో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్‌కు సేవలందించారు. ఆయన అందించిన సేవలు, సాధించిన విజయాలు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. జాతీయ జట్టు కోసం ఆయన పడిన శ్రమను ఎవరూ మర్చిపోలేరు” అని క్రికెట్ బోర్డు భావోద్వేగంతో పేర్కొంది.

2009లో నెదర్లాండ్స్‌తో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌ ద్వారా అరంగేట్రం చేసిన షాపూర్ జద్రాన్, ఆఫ్ఘనిస్థాన్ తరపున 44 వన్డేలు మరియు 36 టీ20లు.. మొత్తంగా 80 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. వన్డేల్లో 44 వికెట్లు తీసిన ఆయన, 24 పరుగులకు 4 వికెట్లు పడగొట్టడం అత్యుత్తమ ప్రదర్శన. అలాగే టీ20ల్లో 27 వికెట్లు తీశారు.

గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన షాపూర్, తన పేస్ బౌలింగ్‌తో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ మరియు తిలకరత్నే దిల్షాన్ వంటి ప్రపంచ స్థాయి బ్యాటర్లను సైతం ఇబ్బంది పెట్టడం విశేషం.


Posted

in

by

Tags: