విచిత్రమైన డేటింగ్.! “మహిళలు మాత్రమే పురుషులను తీసుకురావాలి.” వివాదానికి దారితీసిన మ్యాచ్ మేకింగ్ ఈవెంట్ పేరు.! నిర్వాహకుడు జైదీప్ శర్మ వివరణ.!!

బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ (HSR) లేఅవుట్ ప్రాంతంలో సెప్టెంబర్ 12న జరగనున్న ఓ విచిత్రమైన మ్యాచ్ మేకింగ్ ఈవెంట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.

‘పింప్ యువర్ పాల్’ (Pimp Your Pal) పేరుతో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌లో, మహిళలు తమకు నచ్చిన లేదా తమకు బాగా తెలిసిన ఓ అబ్బాయిని (పురుష మిత్రుడిని) వెంట తీసుకొచ్చి మిగతా మహిళలకు పరిచయం చేయాల్సి ఉంటుంది. పురుషులు నేరుగా ఈ ఈవెంట్‌లో పాల్గొనడానికి దరఖాస్తు చేసుకోలేరు; ఏ మహిళైనా వెంట తీసుకొచ్చి సిఫార్సు చేస్తేనే వారికి అనుమతి లభిస్తుంది. అదే సమయంలో మహిళలు మాత్రం ఒంటరిగా కూడా హాజరుకావచ్చు.

ఈ కార్యక్రమం పేరు తీవ్ర వివాదానికి, విమర్శలకు దారితీయడంతో నిర్వాహకులలో ఒకరైన జైదీప్ శర్మ స్పందిస్తూ వివరణ ఇచ్చారు. “డేటింగ్ యాప్‌లలో నిరంతరం స్వైప్ చేసి విసిగిపోయిన యువతకు సరికొత్త ప్రత్యామ్నాయంగా, మహిళల పూర్తి నియంత్రణ మరియు భద్రత నడుమ ఈ పరిచయ కార్యక్రమం సాగాలనే ఉద్దేశంతోనే ఈ వినూత్న నిబంధనను, ఆ పేరును ఎంచుకున్నాం” అని ఆయన తెలిపారు.


Posted

in

by

Tags: