విజయ్ రాజకీయ సంచలనం: టీవీకే (TVK) పార్టీని ఎన్నికల ముందే రద్దు చేస్తారా?

తమిళ రాజకీయాల్లో భారీ అంచనాలతో అడుగుపెట్టిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఇప్పుడు పెను తుపానులా మారాయి. పార్టీ అధ్యక్షుడు విజయ్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం.

  • అవమానం ఎందుకు?: కేవలం 6 సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలు చెబుతుంటే, పోటీ చేసి అవమానపడటం కంటే రాజకీయాల నుండి తప్పుకోవడమే మేలని విజయ్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాలో ‘దళపతి’గా ఉన్న వ్యక్తి, రాజకీయాల్లో ఓడిపోయిన నాయకుడిగా మిగిలిపోవడానికి ఆయన ఆత్మగౌరవం అంగీకరించడం లేదట.
  • ఒత్తిళ్ల పర్వం: రాజకీయాల్లో ఉంటే ఒకవైపు ఢిల్లీ (కేంద్రం) నుండి, మరోవైపు చెన్నై (స్థానిక పార్టీల) నుండి దాడులు తప్పవు. వీటికి తోడు సొంత పార్టీ వారే ‘ శని లాగా మారి అంతర్గత పోరును పెంచుతుండటం విజయ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.
  • అంతర్గత కుమ్ములాటలు: పాత ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ సభ్యులకు, కొత్తగా చేరిన వారికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. జిల్లా కార్యదర్శుల గొడవలు, సిఫార్సులతో అభ్యర్థుల ఎంపిక వంటివి విజయ్ నిద్ర లేకుండా చేస్తున్నాయి.
  • తీవ్ర నిర్ణయం: “ఇప్పటి వరకు పడ్డ కష్టాలు చాలు, ఈ రాజకీయ బురదలో ఇరుక్కోవడం కంటే గౌరవంగా తప్పుకుందాం” అని ఆయన సన్నిహితుల వద్ద అన్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందే పార్టీని రద్దు చేయడమా లేదా ఒక సేవా సంస్థగా మార్చడమా అని విజయ్ ఆలోచిస్తున్నారట.
  • రజనీకాంత్ బాటలో?: గతంలో రజనీకాంత్ తీసుకున్న నిర్ణయం లాగే, విజయ్ కూడా చివరి నిమిషంలో రాజకీయాల నుండి తప్పుకుంటారని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రాజకీయాల్లో ప్రజల మెప్పు పొందడం కష్టమని ఆయనకు ఇప్పుడు అర్థమవుతోంది.

Posted

in

by

Tags: