విదేశంలో భర్త.. ప్రియుడి ఇంట్లో శవమై వేలాడుతున్న భార్య..! హత్యనా…? ఆత్మహత్యనా…?

తమిళనాడు అరియలూర్ జిల్లాలో వివాహిత తన ప్రియుడి ఇంట్లో ఉరివేసుకుని శవమై కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఇది హత్యనా లేక ఆత్మహత్యనా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

అసలేం జరిగింది? అరియలూర్ జిల్లా సెందురై సమీపంలోని నక్కంపాడి గ్రామానికి చెందిన సెల్వం, ప్రియ దంపతులకు 10 ఏళ్ల కూతురు ఉంది. సెల్వం గత 10 ఏళ్లుగా విదేశాల్లో పని చేస్తూ ఏటా ఒక్కసారి మాత్రమే ఇంటికి వస్తుంటాడు. ఈ క్రమంలో ప్రియ తన ఇంటి వెనుక నివసించే రాజా అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. సెల్వం విదేశం నుండి పంపే డబ్బును కూడా ప్రియ తన ప్రియుడి విలాసాల కోసం ఖర్చు చేసేదని తెలుస్తోంది.

విషయం బయటపడటంతో వివాదం: ఇటీవలే విదేశం నుండి వచ్చిన సెల్వంకు భార్య అక్రమ సంబంధం గురించి తెలియడంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. తాను కష్టపడి పంపిన డబ్బును ప్రియుడికి ఎలా ఇస్తావని సెల్వం ఆమెను నిలదీశాడు. మరుసటి రోజు ఉదయం చూసేసరికి ప్రియ ఇంట్లో లేదు. ఊరంతా వెతకగా, చివరికి తన ప్రియుడు రాజా ఇంట్లో ఆమె శవమై వేలాడుతూ కనిపించింది. ఆ సమయంలో రాజా అక్కడ లేకపోవడం పలు అనుమానాలకు దారితీసింది.

పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రియుడి ఇంట్లో శవమై ఎలా కనిపించింది? ఆ సమయంలో రాజా ఎక్కడ ఉన్నాడు? భర్తతో గొడవ జరిగిన తర్వాత ఏం జరిగింది? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే ఇది హత్యనా లేక ఆత్మహత్యనా అనేది తేలుతుంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *