“విమానంలో కొబ్బరికాయలకు నిషేధమని అందరికీ తెలుసు”.. కానీ ఇతను మాత్రం పూర్తి కాయను తీసుకెళ్లాడు. కారణం వింటే ఆశ్చర్యపోతారు..!!

విమాన ప్రయాణం చేసేటప్పుడు ఏ వస్తువులను తీసుకెళ్లాలి, వేటిని తీసుకెళ్లకూడదు అనే విషయాలపై ప్రయాణీకులకు అవగాహన ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా భద్రతా నియమాల ప్రకారం, హ్యాండ్ బ్యాగేజీలో 100 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ ద్రవ పదార్థాలను తీసుకెళ్లడానికి అనుమతి ఉండదు.

ఈ నేపథ్యంలో, ఒక వ్యక్తి విమానంలోకి పూర్తి కొబ్బరికాయను తీసుకువెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అతను మొదట ఒక గదిలో కొబ్బరికాయను చూపిస్తాడు, ఆపై అదే కాయను విమానం లోపల కూడా చూపిస్తాడు.

దీనిపై అతను వివరణ ఇస్తూ.. విమానంలో వాటర్ బాటిళ్లను తీసుకెళ్లడానికి అనుమతి లేదు, కానీ కట్ చేయని పూర్తి కొబ్బరికాయలను తీసుకెళ్లవచ్చు. ప్రయాణ సమయంలో ఆ కొబ్బరికాయను తెరిచి లోపల ఉన్న నీటిని తాగవచ్చు. దీనివల్ల ప్రయాణమంతా శరీరాన్ని హైడ్రేటెడ్ (నీటి శాతం తగ్గకుండా)గా ఉంచుకోవచ్చని అతను తెలిపాడు.

ఈ నియమం అమెరికాలో అమలులో ఉన్నట్లు సమాచారం. అమెరికా రవాణా భద్రతా పరిపాలన (TSA) నిబంధనల ప్రకారం, 100 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ ద్రవాలను నేరుగా తీసుకెళ్లడం నిషేధం. దీనిని అధిగమించడానికి, ఆ వ్యక్తి ఒక వినూత్న మార్గంలో పూర్తి కొబ్బరికాయను విమానంలోకి తీసుకెళ్లానని వివరించాడు.

ఈ వీడియోను ‘X’ (ట్విట్టర్)లో @SolBrah అనే ఖాతా షేర్ చేసింది. “పూర్తి వాటర్ బాటిల్‌ను విమానంలోకి అనుమతించరు, కానీ తెరవని పూర్తి కొబ్బరికాయను అనుమతిస్తారు. దానిని తెరవడానికి ఒక చిన్న పరికరం ఉంటే చాలు.. గమ్యం చేరే వరకు దాహం వేయకుండా చూసుకోవచ్చు” అని అతను పేర్కొన్నాడు. కేవలం 5 సెకన్ల నిడివి గల ఈ వీడియో ఇప్పటివరకు 15 వేలకు పైగా వీక్షణలను పొందింది. ఈ వింత ప్రయాణ చిట్కాపై సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Posted

in

by

Tags: