ముంబైలోని వడాలా ప్రాంతంలో ఉన్న గణేష్ నగర్ ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక మహిళను లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఆమె దుర్మరణం చెందారు.
ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలాన్ని రేపింది.
ముంబై వడాలాలోని గణేష్ నగర్ ప్రాంతానికి చెందిన అమీనా అన్సారీ అనే మహిళ యథావిధిగా రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో అటుగా వచ్చిన ఒక సరుకు లారీ అనుకోకుండా ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది.
ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఈ విషాదకర సంఘటన స్థానిక ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి, వేదనకు గురిచేసింది.
ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానికులు మరియు బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సరైన భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వారు అకస్మాత్తుగా రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకుని వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను సముదాయించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Leave a Reply