బెంగళూరు, మార్చి 31, 2026 – భారతదేశపు అగ్రగామి AI ఆధారిత స్థానిక భాషా సాంకేతిక వేదిక మరియు డైలీహంట్, జోష్, మాగ్స్టర్, NexVerse.ai ల మాతృసంస్థ అయిన ‘వెర్సే ఇన్నోవేషన్’, తమ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా శ్రీ పీ.ఆర్. రమేష్‌ను నియమిస్తున్నట్లు ఈరోజు ప్రకటించింది. ఆయన ఆడిట్ కమిటీ ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తారు. కంపెనీ తన తదుపరి దశ వ్యూహాత్మక వృద్ధి వైపు పయనిస్తున్న తరుణంలో, సంస్థాగత పారదర్శకతను (Governance) పటిష్టం చేయడం ఈ నియామక ప్రధాన ఉద్దేశ్యం.
పీ.ఆర్. రమేష్ నేపథ్యం: రమేష్ గారు చార్టర్డ్ అకౌంటెంట్‌గా ఆర్థిక పర్యవేక్షణ, కార్పొరేట్ గవర్నెన్స్ మరియు రెగ్యులేటరీ సలహాదారుగా 40 ఏళ్లకు పైగా అనుభవం కలిగి ఉన్నారు. ఆయన గతంలో డెలాయిట్ ఇండియా (Deloitte India) ఛైర్మన్‌గా మరియు డెలాయిట్ గ్లోబల్ బోర్డు సభ్యునిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఎయిర్ ఇండియా, సిప్లా, నెస్లే ఇండియా, లార్సెన్ & టూబ్రో (L&T), ఐటీసీ హోటల్స్ వంటి ప్రముఖ కంపెనీల బోర్డుల్లో సభ్యునిగా ఉన్నారు. 2022-23 సంవత్సరానికి గాను ఆసియా సెంటర్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ నుండి “బెస్ట్ ఇండిపెండెంట్ డైరెక్టర్” అవార్డును కూడా అందుకున్నారు.
సెబీ (SEBI), ఆర్బీఐ (RBI) మరియు ఐఆర్డీఏ (IRDA) వంటి నియంత్రణ సంస్థల కమిటీల్లో సభ్యునిగా ఉంటూ, భారతదేశ ఆర్థిక ప్రమాణాల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు.
వెర్సే ఇన్నోవేషన్ కో-ఫౌండర్ ఉమంగ్ బేడీ స్పందన: “ఒక సంస్థ కాలక్రమేణా నిలబడాలంటే బలమైన ఆర్థిక క్రమశిక్షణ అవసరం. పీ.ఆర్. రమేష్ గారికి అంతర్జాతీయ స్థాయిలో ఆడిట్ మరియు రెగ్యులేటరీ అంశాలపై అపారమైన అవగాహన ఉంది. వెర్సే ఇన్నోవేషన్ స్థిరమైన వృద్ధిని లక్ష్యంగా చేసుకున్న తరుణంలో, ఆయన అనుభవం మా గవర్నెన్స్ ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా స్టేక్ హోల్డర్ల నమ్మకాన్ని రెట్టింపు చేస్తుంది.”
పీ.ఆర్. రమేష్ మాటల్లో: “భారతదేశ డిజిటల్ రంగంలో వెర్సే ఒక భారీ సామ్రాజ్యాన్ని నిర్మించింది. సంస్థ స్థాయి పెరిగే కొద్దీ బాధ్యత కూడా పెరుగుతుంది. ఆవిష్కరణలతో పాటు జవాబుదారీతనం ఉన్నప్పుడే బలమైన సంస్థలు తయారవుతాయి. వెర్సే మేనేజ్మెంట్ టీమ్‌తో కలిసి పనిచేస్తూ, బాధ్యతాయుతమైన వృద్ధికి తోడ్పడే గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.”
