శబరిమల బంగారు దొంగతనం కేసు: నటుడు జయరాం విచారణ – స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన SIT

శబరిమల అయ్యప్ప ఆలయంలోని ద్వారపాలకుల విగ్రహాలకు బంగారు తాపడం చేసే సమయంలో 4.5 కిలోల బంగారం దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై కేరళ అదనపు డీజీపీ వెంకటేష్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ జరుపుతోంది. ఈ కేసులో దేవస్వామ్ బోర్డు మాజీ అధ్యక్షుడితో సహా ఇప్పటికే 11 మందిని అరెస్టు చేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఉన్నికృష్ణన్‌ను గత ఏడాది అక్టోబర్‌లో 10 గంటల పాటు విచారించి అరెస్టు చేశారు. ఈ క్రమంలో తాజాగా నటుడు జయరాంను కూడా SIT అధికారులు విచారించారు. చెన్నైలోని ఆయన నివాసంలో ఈ విచారణ జరిగింది.

విచారణకు కారణం: శబరిమల ద్వారపాలకుల విగ్రహాల బంగారు పలకలను మరమ్మతుల కోసం చెన్నైకి తీసుకువచ్చినప్పుడు, వాటిని నటుడు జయరాం ఇంట్లో ఉంచి పూజలు చేసినట్లు అధికారులకు సమాచారం అందింది. దీని ఆధారంగానే ఆయనను విచారించారు. ఈ వ్యవహారంతో తనకు ప్రత్యక్ష సంబంధం లేదని జయరాం గతంలోనే వివరణ ఇచ్చినప్పటికీ, దర్యాప్తులో భాగంగా అధికారులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ కేసులో మరికొందరు ప్రముఖులను కూడా విచారించే అవకాశం ఉందని సమాచారం.


Posted

in

by

Tags: