ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్లో ఒక వింత మరియు అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తన కుమారుడికి నిశ్చయమైన వధువుతోనే తండ్రి వివాహం చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
ఏం జరిగింది? షకీల్ అనే వ్యక్తికి అర్షద్ అనే కుమారుడు ఉన్నాడు. అర్షద్కి 24 ఏళ్ల యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే, కాబోయే కోడలి అందాన్ని చూసి మోహంలో పడిపోయిన తండ్రి షకీల్ (55), ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
నాటకీయంగా.. ఆ యువతికి ఆరోగ్యం బాలేదని, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తానని నమ్మబలికి ఆమెను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాడు. అలా తీసుకెళ్లిన మూడు రోజుల వరకు ఆమెను తిరిగి తీసుకురాలేదు. ఈలోగా రహస్యంగా ఆమెను వివాహం చేసుకుని, భార్యాభర్తలుగా తిరిగి గ్రామస్తుల ముందు ప్రత్యక్షమయ్యాడు. ఈ విషయం తెలిసి కుమారుడు, కుటుంబ సభ్యులు మరియు గ్రామస్థులు షాక్కు గురయ్యారు.
పంచాయితీ తీర్పు: ఈ అసాంఘిక, అపవిత్ర వివాహాన్ని గ్రామ పంచాయతీ తీవ్రంగా ఖండించింది. సమాజ కట్టుబాట్లను ఉల్లంఘించినందుకు గాను, ఆ జంటను గ్రామం నుండి వెలివేస్తూ పంచాయతీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆ జంట గ్రామంలో ఉండలేక పట్టణంలో వేరే చోట కాపురం ఉంటున్నారు. బాధితురాలి కుటుంబం పేదరికంలో ఉండటం వల్ల పెద్దగా వ్యతిరేకించలేదని సమాచారం. ఏది ఏమైనా, 55 ఏళ్ల వృద్ధుడు తన కొడుకు జీవితాన్ని నాశనం చేసి, 24 ఏళ్ల యువతిని వివాహం చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
