షాకింగ్ వీడియో: ఏసీ రిపేర్ చేయడానికి వచ్చిన మెకానిక్ దాని కవర్‌ తీయగానే.. లోపల దృశ్యం చూసి హడలిపోయిన జనం

సాధారణంగా చలికాలంలో ప్రజలు ఏసీలను వాడకుండా వదిలేస్తారు. మళ్లీ ఎండలు మొదలైనప్పుడు వాటిని శుభ్రం చేయించి, రిపేర్ చేయించుకుంటారు. అలాగే ఒక ఇంటి యజమాని తన ఏసీని రిపేర్ చేయించాలని నిర్ణయించుకున్నాడు.

శుభ్రం చేయడం కోసం మెకానిక్‌ను పిలిచారు. మెకానిక్ పని మొదలుపెట్టి, ఏసీ యూనిట్ కవర్‌ను తీయగానే లోపల ఉన్న దృశ్యాన్ని చూసి అందరూ నోరెళ్లబెట్టారు. ఈ పూర్తి దృశ్యాన్ని మెకానిక్ తన మొబైల్‌లో రికార్డ్ చేయగా, ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వీడియోలో ఏముంది? వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి ఏసీ యూనిట్‌ను విప్పుతుండటం కనిపిస్తుంది. గోడకు ఉన్న ఆ స్ప్లిట్ ఏసీ బయటకు చాలా మామూలుగానే కనిపిస్తోంది. కానీ, మెకానిక్ కవర్ తీయగానే లోపల ఉన్న పరిస్థితి చూసి అందరూ షాక్‌కు గురయ్యారు. నిజానికి ఆ ఏసీ యూనిట్ లోపల ఒక ఎలుక తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది. ఏసీ లోపల మట్టి, చెత్తాచెదారంతో నింపేసి దానిని ఒక పాత సామాన్ల కుప్పలా మార్చేసింది. అంతేకాకుండా, డ్రైన్ పైపులో ఒక ఎలుక దాక్కుని ఉండటం కూడా మీరు చూడవచ్చు.

నెటిజన్ల స్పందన: ఈ వీడియోను ‘@ChapraZila’ అనే ఎక్స్ (X) ఖాతా నుండి షేర్ చేయగా, కొన్ని గంటల్లోనే లక్షలాది మంది వీక్షించారు. “ఈ ఏసీ యజమాని ఎంత అజాగ్రత్త పరుడో కదా” అని క్యాప్షన్ ఇచ్చారు. అయితే నెటిజన్లు మాత్రం దీనికి ఏసీ ఇన్స్టాల్ చేసిన టెక్నీషియన్‌దే తప్పని అంటున్నారు. గోడకు డ్రైన్ పైపు కోసం చేసిన రంధ్రం (hole) సరిగ్గా సీల్ చేయకపోవడం వల్లే ఎలుకలు లోపలికి వెళ్లాయని వారు అభిప్రాయపడుతున్నారు. “స్టెబిలైజర్ పెట్టారు కానీ, పైపు రంధ్రం మూయడం మర్చిపోయారు” అని ఒకరు, “ఇలాంటి స్థితిలో ఏసీ ఆన్ చేస్తే షార్ట్ సర్క్యూట్ అయి మంటలు అంటుకుంటాయి” అని మరొకరు కామెంట్ చేశారు.


Posted

in

by

Tags: