“షాపు మూసేయండిరా.. నేను తాగాలి!” వైన్ షాపులోకి దూరి మందు కొట్టిన కోతి.. మత్తు తలకెక్కి చివరికి జరిగిన వింత తంతు!

జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలోని ఓర్మాంఝీ (Ormanjhi) ప్రాంతంలో ఉన్న ఓ మద్యం దుకాణంలోకి ఆడ కోతి ఒకటి ఒక్కసారిగా చొరబడింది.

శుక్రవారం నాడు జరిగిన ఈ ఘటనలో, వైన్ షాపులోకి దూరిన ఆ చిన్న కోతి అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ కోతిని బయటకు తరిమేందుకు ప్రయత్నించిన షాపు సిబ్బందిని అది కరిచేందుకు యత్నించడంతో, భయపడిపోయిన ఉద్యోగులు దుకాణం వదిలి బయటకు పరుగులు తీశారు.

సిబ్బంది బయటకు వెళ్లగానే దుకాణాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్న ఆ ఆడ కోతి, అక్కడున్న ఓ మద్యం సీసా మూత తీసి మందు తాగింది. మద్యం తాగిన కొద్ది నిమిషాల్లోనే మత్తు తలకెక్కడంతో, ఆ చిన్న కోతి దుకాణంలోనే హాయిగా పడుకుని నిద్రపోవడం మొదలుపెట్టింది. ఈ వింత ఘటనకు సంబంధించిన వార్త ఆ ప్రాంతమంతా దావానలంలా వ్యాపించింది.

మందు తాగి నిద్రపోతున్న కోతిని చూడటానికి మద్యం దుకాణం ముందు పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ రెస్క్యూ బృందం, నిద్రపోతున్న కోతికి ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బంధించి అటవీ ప్రాంతానికి తరలించారు. ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *