“షుగర్ పేషెంట్లు వాకింగ్ చేస్తున్నారా?” ఈ 2 రోజులు మాత్రం.. పొరపాటున కూడా నడవకండి.. మీరు చేసే ఆ.. పెద్ద తప్పు ఇదే..!!!

షుగర్ వ్యాధి ఉన్నవారు ప్రతిరోజూ నడవటం (వాకింగ్ చేయడం) వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అలవాటు.

నడకను ఎలా సాగించాలి, ఎంత సమయం నడవాలి అనే దానిపై చాలామందికి పలు అనుమానాలు ఉండటం సహజం.

ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు పరిశోధనల నివేదికల ప్రకారం, ప్రతిరోజూ 30 నుండి 40 నిమిషాల పాటు వాకింగ్ చేయడం సరిపోతుంది. ఉదయం లేదా సాయంత్రం మీ వీలును బట్టి సమయాన్ని ఎంచుకోవచ్చు. కానీ పరగడుపున లేదా పొట్ట నిండా తిన్న వెంటనే మాత్రం నడవకూడదు.

వారంలో 5 రోజులు కచ్చితంగా వాకింగ్ చేయాలని పరిశోధకులు చెబుతున్నారు. మిగిలిన 2 రోజులు విశ్రాంతి తీసుకోవచ్చు, అయినప్పటికీ ఆ 2 రోజులు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఉండకూడదు. వరుసగా రెండు రోజుల పాటు శరీరానికి ఎలాంటి కదలికలు లేకపోవడం మంచిది కాదు.

వాకింగ్ చేసే సమయంలో నెమ్మదిగా గానీ లేదా సాధారణంగా మాట్లాడుకుంటూ షాపులకు వెళ్తున్నట్లుగా గానీ నడవకూడదు; నడుస్తున్నామనే పూర్తి ధ్యాసతో, స్పృహతో నడవాలి. ఒకేసారి 30 నిమిషాలు నడవలేనివారు ఉదయం 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు చొప్పున విడదీసి కూడా నడవవచ్చు.

అదే సమయంలో, షుగర్ వ్యాధి వల్ల కాళ్లలో పుండ్లు లేదా ఇన్ఫెక్షన్ ఉన్నవారు, దృష్టి మందగించినవారు, గర్భిణులు మరియు అధిక రక్తపోటు (బీపీ) ఉన్నవారు వాకింగ్ చేయకపోవడం మంచిది. వీరు దానికి బదులుగా వైద్యుల సలహాతో ఇంట్లోనే యోగా, ధ్యానం వంటి సరళమైన వ్యాయామాలు చేయవచ్చు.


Posted

in

by

Tags: