సంగీత నిర్ణయం వెనుక రాజకీయ కుట్ర ఉందా? విజయ్‌ను దెబ్బతీసేందుకు ‘మెగా’ పార్టీ స్కెచ్? – టీవీకే (TVK) శ్రేణుల ఆవేదన!

ఈ వ్యవహారం విజయ్ వ్యక్తిగత కుటుంబ విషయమే అయినప్పటికీ, రాబోయే ఎన్నికల్లో విజయ్ పెద్ద రాజకీయ మార్పును తెస్తారని అందరూ నమ్ముతున్న తరుణంలో, ఆయన ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా ఈ పరిణామాలు ఉన్నాయి.

నటుడు మరియు టీవీకే (TVK) అధినేత విజయ్ నుండి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విజయ్‌కి ఒక నటితో సంబంధం ఉందని, ఆ నటితో కలిసి ఆయన విదేశాల్లో తిరిగారని సంగీత తన పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం. విజయ్ ఆ నటితో సంబంధంలో ఉండటం తనకు, తన పిల్లలకు అవమానకరంగా ఉందని, ఎన్నిసార్లు చెప్పినా విజయ్ ఆ వివాహేతర సంబంధాన్ని వదులుకోలేదని సంగీత తెలిపారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

గత కొన్నేళ్లుగా విజయ్ మరియు ఆయన భార్య విడివిడిగా ఉంటున్నారని ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఇప్పుడు ఆమె స్వయంగా కోర్టుకు వెళ్లడం సంచలనం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీపై భారీ అంచనాలు ఉన్న సమయంలో, భార్య స్వయంగా ఇలాంటి ఆరోపణలు చేయడం డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి ప్రత్యర్థి పార్టీలకు అయాచితంగా దొరికిన అవకాశంగా మారింది.

రాజకీయ విమర్శలు:

“ఒక పార్టీ నాయకుడే ఇలా ఉంటే, ఆ పార్టీ లక్షణం ఏంటో అర్థమవుతోంది. సొంత భార్యనే పట్టించుకోని విజయ్, తమిళనాడు మహిళలను ఎలా రక్షిస్తారు?” అని ప్రత్యర్థి పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఇది వ్యక్తిగత విషయం – టీవీకే శ్రేణుల కౌంటర్:

దీనిపై టీవీకే కార్యకర్తలు స్పందిస్తూ.. “ఇది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత కుటుంబ విషయం. కానీ ఎన్నికల లబ్ధి కోసం డీఎంకే వంటి పార్టీలు దీన్ని రాజకీయం చేయడం సిగ్గుచేటు” అని మండిపడుతున్నారు.

అంతేకాకుండా, “విజయ్‌కు నటితో సంబంధం ఉంటే సంగీత విడాకులు కోరడం వారి వ్యక్తిగత విషయం. కానీ ఇన్ని రోజులు మౌనంగా ఉండి, ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలోనే సంగీత కోర్టుకు వెళ్లడం వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా? విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి ఏదైనా ‘మెగా’ పార్టీ ఆమెను ఉసిగొల్పిందా? అని మాకు అనుమానంగా ఉంది” అని టీవీకే మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.


Posted

in

by

Tags: