భారత్‌లో సైబర్ నేరాలను పూర్తిగా అరికట్టే ఉద్దేశంతో టెలికాం శాఖ ఓ కీలకమైన కొత్త నిబంధనను తీసుకొచ్చింది.
దీని ప్రకారం, రానున్న 2027 జనవరి 1వ తేదీ నుంచి వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్‌లు పనిచేయాలంటే.. ఆ నంబర్‌కు సంబంధించిన సిమ్ కార్డు మీ మొబైల్లో నిరంతరం పనిచేస్తూ (యాక్టివ్‌గా) ఉండాలి.
మనం ఏ మొబైల్ నంబర్‌తో అయితే ఖాతా (అకౌంట్) తెరిచామో, అదే నంబర్ ఉన్న సిమ్ కార్డు లేదా ఇ-సిమ్ (eSIM) ఆ ఫోన్లోనే ఉండటం తప్పనిసరి చేశారు.
ఒకవేళ మొబైల్ నుంచి ఆ సిమ్ కార్డును తీసేసినా లేదా మార్చేసినా వాట్సాప్, టెలిగ్రామ్ యాప్‌లు ఎక్కడా పనిచేయవనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి.
సరిహద్దులు దాటి జరిగే సైబర్ మోసాలు, ‘డిజిటల్ అరెస్ట్’ వంటి ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకే టెలికాం శాఖ ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply