ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించడం ఎంత అవసరమో గుర్తుచేసేలా ఒక దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది.
బైక్ వెనుక కూర్చున్న వ్యక్తిని ఒక జంక్షన్ వద్ద దింపి, మెయిన్ రోడ్డుపైకి వస్తూ అటూ ఇటూ చూసుకోకుండా సడన్గా బైక్ను తిప్పడంతో.. వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది.
ఒక్క క్షణంలో చేసే చిన్నపాటి నిర్లక్ష్యం నిండు ప్రాణాలనే బలితీసుకుంటుందనడానికి ఈ ప్రమాదమే నిదర్శనం. అయితే ఈ ఘటనలో సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యత అత్యంత కీలకంగా మారింది. ఒకవేళ సీసీటీవీ దృశ్యాలు రికార్డు కాకపోయి ఉంటే, “వేగంగా వచ్చిన కారే గుద్దింది” అంటూ మొత్తం నెపాన్ని కార్ డ్రైవర్ పైనే నెట్టేసేవారు.
కానీ వైరల్ అవుతున్న వీడియోలో కారు తన దారిలో పద్ధతిగానే వెళ్లడం, బైక్ నడిపే వ్యక్తే ఎలాంటి హెచ్చరిక లేదా జాగ్రత్త లేకుండా హఠాత్తుగా రోడ్డుపైకి వాహనాన్ని పోనివ్వడం స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి వాహనాన్ని ముందుకు కదిలించే ముందు ఒక్క క్షణం ఆగి, రోడ్డుకి ఇరువైపులా చూసి వెళ్లడం మన ప్రాణాలకే రక్షణ.
ఈ హెచ్చరిక మన ప్రాణాల కోసమే కాదు, మనల్ని నమ్ముకున్న మన కుటుంబాల కోసమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ట్రాఫిక్ నిబంధనలను గౌరవిద్దాం.. ప్రమాదాలను అరికట్టి సురక్షితమైన ప్రయాణాన్ని కొనసాగిద్దాం.

Leave a Reply