న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం (నేడు) భారత న్యాయ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నారు. కోర్టు అనుమతి ఇస్తే, సుప్రీంకోర్టులో తన తరపు వాదనలను స్వయంగా ఆమె వినిపించనున్నారు.
ఎన్నికల సంఘం చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR – ఓటరు జాబితా ప్రత్యేక సవరణ)ను సవాలు చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం విచారణ జరగనుంది.
ముఖ్యాంశాలు:
- నేరుగా వాదనలు: న్యాయశాస్త్రంలో పట్టా (Law Degree) ఉన్న మమతా బెనర్జీ, కోర్టులో నేరుగా మాట్లాడేందుకు అనుమతి కోరుతూ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు.
- కోర్టుకు రాక: ఆమె ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలోనే సుప్రీంకోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. తన న్యాయ బృందంతో కలిసి ఆమె కోర్టుకు హాజరయ్యారు.
- ధర్మాసనం: భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) నేతృత్వంలోని జస్టిస్ జోయ్మల్యా బాగ్చీ మరియు జస్టిస్ విపుల్ పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.
- సహ పిటిషనర్లు: మమతతో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు డెరెక్ ఓబ్రెయిన్, డోలా సేన్ మరియు మోస్తారి భాను దాఖలు చేసిన పిటిషన్లను కూడా ధర్మాసనం కలిపి విచారించనుంది.
మమతా బెనర్జీ “పార్టీ ఇన్ పర్సన్” (న్యాయవాది లేకుండా తన కేసును తానే వాదించుకోవడం)గా కోర్టును ఆశ్రయించడం ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రికి ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
