సేవా తీర్థ్: ‘ప్రజలే దేవుళ్లతో సమానం’ – కొత్త ప్రధాని కార్యాలయంలో మోదీ చేసిన 4 కీలక సంతకాలు!

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో నూతన ప్రధానమంత్రి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యాలయానికి ‘సేవా తీర్థ్’ అని పేరు పెట్టారు.

‘సేవా తీర్థ్’ నినాదంగా “ప్రజలే దేవుళ్లతో సమానం” అనే వాక్యాన్ని అక్కడ చెక్కారు. ఈ సేవా తీర్థ్ భవన సముదాయంలో ప్రధానమంత్రి కార్యాలయం (PMO), క్యాబినెట్ సెక్రటేరియట్ మరియు జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ కార్యాలయాలు అన్నీ ఒకే చోట ఉంటాయి. ఈ నూతన మార్పు యొక్క ప్రత్యేకత ఇదే.

చాలా ఏళ్లుగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ వేర్వేరు ప్రాంతాల్లో ఉండటం వల్ల పాలనాపరమైన జాప్యం జరిగేది. దీనిని సరిదిద్దడానికి మరియు ప్రభుత్వ కార్యకలాపాలను సులభతరం చేయడానికి ఈ మార్పు చేపట్టినట్లు తెలుస్తోంది.

కొత్తగా ప్రారంభించిన సేవా తీర్థ్‌లో మోదీ నాలుగు ముఖ్యమైన దస్త్రాలపై సంతకాలు చేశారు:

  1. PM RAHAT పథకం: ఈ పథకం కింద, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి రూ. 1.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తారు.
  2. లక్షాధికారి దీదీ లక్ష్యం (Lakhpati Didi): 2029 నాటికి ఈ పథకం కింద 6 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు.
  3. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (Agri Infra Fund): ఈ నిధిని రూ. 1 లక్ష కోటి నుండి రూ. 2 లక్షల కోట్లకు పెంచారు.
  4. స్టార్టప్ ఇండియా ఫండ్స్ ఆఫ్ ఫండ్స్: కొత్త సాంకేతికతలకు మద్దతు ఇచ్చే విధంగా అదనంగా రూ. 10,000 కోట్ల నిధులను కేటాయించారు.

Posted

in

by

Tags: